ఒక పెద్ద సినిమా విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకుందంటే.. ముందు వెనుక వారాల్లో వచ్చిన సినిమాలకు బ్యాండ్ తప్పదు. అందులోనూ ఒక సినిమా ఇండస్ట్రీ రికార్డులు బద్దలు కొడుతూ దూసుకెళ్తున్నపుడు తర్వాతి వారంలో విడుదలయ్యే సినిమాకు ఉనికే కష్టమవుతుంది. కానీ ‘చల్ మోహన్ రంగ’ మాత్రం ‘రంగస్థలం’ ఉద్ధృతిని బాగానే తట్టుకుంటోంది. వీకెండ్ తర్వాత కూడా ‘రంగస్థలం’ కలెక్షన్లు స్టడీగా ఉన్న సమయంలో ఈ చిత్రం విడుదలైంది.
దీనికి టాక్ బాగానే ఉన్నప్పటికీ ‘రంగస్థలం’ ముందు ఏమాత్రం నిలుస్తుందో అని సందేహించారు. కానీ ఆ సందేహాల్ని ఈ చిత్రం పటాపంచలు చేసింది. ‘చల్ మోహన్ రంగ’ విడుదలైంది వారం మధ్యలో.. గురువారం. అయినప్పటికీ తొలి రోజు రూ.3 కోట్లకు చేరువగా షేర్ వచ్చింది. రెండో రోజు కూడా కలెక్షన్లు స్టడీగా ఉన్నాయి. శని.. ఆదివారాల్లో ఈ చిత్ర వసూళ్లు తొలి రెండు రోజుల కంటే ఎక్కువగా ఉంటాయని భావిస్తున్నారు. ఈ చిత్రానికి కామెడీ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఎంటర్టైన్మెంట్ కోరుకునే ప్రేక్షకులు ఈ చిత్రాన్ని బాగా ఆదరిస్తున్నారు.
ఓవైపు ‘రంగస్థలం’ ప్రభంజనం రెండో వారాంతంలోనూ కొనసాగుతున్నప్పటికీ.. దాన్ని తట్టుకుని ‘చల్ మోహన్ రంగ’ మంచి వసూళ్లే రాబడుతోంది. వీకెండ్లో బుకింగ్స్ చాలా పాజిటివ్ గా ఉన్నాయి. అమెరికాలో ఈ చిత్రం ఇప్పటికే 3 లక్షల డాలర్ల దాకా వసూలు చేయడం విశేషం. వీకెండ్లో వసూళ్లు అంచనాలకు తగ్గట్లుగా వస్తే బయ్యర్లు చాలా వరకు పెట్టుబడిని వెనక్కి తెచ్చుకున్నట్లే.
‘రంగస్థలం’ లాంటి ఇండస్ట్రీ హిట్ ప్రభంజనం సాగుతున్న సమయంలో వసూళ్లు నిలకడగా సాగడమంటే చిన్న విషయం కాదు. ‘రౌడీ ఫెలో’తో తొలి ప్రయత్నంలోనే దర్శకుడిగా రుజువు చేసుకున్న కృష్ణచైతన్య తన తొలి సినిమాకు పూర్తి భిన్నంగా ఎంటర్టైన్మెంట్ తో ‘చల్ మోహన్ రంగ’ను నడిపించాడు. ఆ ఎంటర్టైన్మెంటే సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ప్రేక్షకుల్ని అలరిస్తోంది.