ఫోటో స్టొరీ: ఉఫ్.. ఆ స్టైల్.. ఆ యాటిట్యూడ్!

Update: 2019-04-09 07:22 GMT
చాందిని చౌదరి తెలుసు కదా? షార్ట్ ఫిలిమ్స్ లో నటించి గుర్తింపు తెచ్చుకున్న చాందిని కొన్ని తెలుగు సినిమాల్లో కూడా నటించింది.  'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్'.. 'హౌరా బ్రిడ్జ్'.. 'మను' లాంటి సినిమాల్లో నటించింది చాందిని. కానీ ఇంకా బ్రేక్ మాత్రం రాలేదు.  షార్ట్ ఫిలిమ్స్.. సినిమాలు ఎలా ఉన్నా సోషల్ మీడియాలో మాత్రం ఈ తెలుగు బ్యూటీ చాలా యాక్టివ్ గా ఉంటుంది.  రెగ్యులర్ గా అప్డేట్స్ ఇస్తూ ఇంటర్నెట్ నియోజకవర్గ ఓటర్లతో నిత్యం టచ్ లో ఉంటుంది. ఎందుకంటే డబ్బు ఇవ్వకపోయినా.. పథకాలు అందకపోయినా.. వీవీ ప్యాట్ స్లిప్పులు ఉన్నా లేకపోయినా.. ఏమీ ఆశించకుండా ఫోటోలకు నిజాయితీగా లైకులు కొట్టేది వారే కదా?

తాజాగా చాందిని చౌదరి తన ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా కొత్త ఫోటో షూట్ కు సంబంధించిన ఫోటోలు పోస్ట్ చేసింది.  ఫోటోగ్రాఫర్ శక్తి స్మరణ్ చేసిన ఫోటోషూట్లో చాందిని తన స్టైల్ ను.. గ్లామర్ ను జాగ్రత్తగా ఒలకబోసింది చాందిని. బ్లాక్ కలర్ టాప్ సిల్వర్ కలర్ ప్యాంట్ ధరించి. మెడలో సిల్వర్ కలర్ లాంగ్ చైన్స్.. వెడల్పాటి చెవి రింగులతో డిఫరెంట్ పోజులిచ్చింది. ఎత్తైన స్టూలుపై కూర్చొని ఫోటో షూట్ కు సరిపోయే యాటిట్యూడ్ ను రంగరించింది.  తెలుగు ఫిలిం మేకర్స్ ఎవరైనా ఈ ఫోటోలను చూస్తే చాందినికి ఆఫర్ రావడం ఖాయమే.

ఈ ఫోటోలకు నెటిజనుల స్పందన కూడా పాజిటివ్ గా ఉంది.  లవ్లీ అని.. బ్యూటిఫుల్ అని.. క్యూట్ గా ఉన్నావని తమకు తోచిన రీతిలో ప్రశంసల వర్షం కురిపించారు.  ఈ నెటిజనులలో చాలామంది షార్ట్ ఫైలిమ్స్ చూసి చాందినికి అభిమానులుగా మారామని చెప్పడం గమనించాల్సిన అంశం.  మరి ఈ తెలుగు బ్యూటీ టాలీవుడ్ లో కూడా తన సత్తా చాటాలని కోరుకుందాం.


Tags:    

Similar News