అథ్లెట్ ఛాన్స్ ఇప్పించ‌రూ ప్లీజ్‌!

Update: 2018-09-06 01:30 GMT
ఎలివేట్ చేసుకునే సుగుణం ఉండాలే కానీ, ఈ రోజుల్లో సామాజిక మాధ్య‌మాలు - యూట్యూబ్ ట్యాలెంటుకు డైరెక్ట్‌ ర‌హ‌దారిలా దారి చూపిస్తున్నాయి. ఆ కోవ‌లోనే యూట్యూబ్ సెన్సేష‌న్‌ గా అందరికీ సుప‌రిచితమంది తెలుగమ్మాయి చాందిని చౌద‌రి. యూట్యూబ్‌ లో ఈ అమ్మ‌డి ల‌ఘుచిత్రాలు పాపుల‌ర‌వ్వ‌డంతో ఆ త‌ర్వాత సినిమా అవ‌కాశాలు వ‌రిస్తున్నాయి. 2015లో కేటుగాడు సినిమాతో తెరంగేట్రం చేసిన చాందిని - అటుపై 2016లో కుంద‌న‌పు బొమ్మ చిత్రంలో న‌టించింది. 2017లో శ‌మంత‌క‌మ‌ణి చిత్రంలో అద్భుత న‌ట‌ప్ర‌ద‌ర్శ‌న‌తో ఆక‌ట్టుకుంది. ఈ ఏడాది `హౌరా బ్రిడ్జ్` అనే క్రేజీ చిత్రంలో న‌టిస్తూ టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యింది. ఈలోగానే చాందిని న‌టించిన `మ‌ను` రిలీజ్‌ కి రెడీ అవుతోంది.

బ్ర‌హ్మానందం త‌న‌యుడు రాజా గౌత‌మ్ స‌ర‌స‌న చాందిని `మ‌ను` చిత్రంలో న‌టించింది. ఇదివ‌ర‌కూ రిలీజైన `మ‌ను` ట్రైల‌ర్ ఆద్యంతం చాందిని థ్రిల్లింగ్ యాక్ట్ ఆక‌ట్టుకుంది. ఈ శుక్ర‌వారం (సెప్టెంబ‌ర్ 7) మ‌ను రిలీజ్ సంద‌ర్భంగా ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మాల‌తో బిజీబిజీగా ఉంది ఈ భామ‌. హైద‌రాబాద్ ఫిలింఛాంబ‌ర్‌ లో జ‌రిగిన ఇంట‌ర్వ్యూలో చాందిని మాట్లాడుతూ .. త‌న‌కు ఎలాంటి పాత్ర‌ల్లో న‌టించ‌డం అంటే ఇష్ట‌మో తెలియ‌జేసింది. స్వ‌త‌హాగానే తాను క్రీడాకారిణి.. ఆట‌గ‌త్తెగా రాణించాన‌ని తెలిపింది. అందుకే త‌న‌కు క్రీడాకారిణి బ‌యోపిక్‌ లో న‌టించాల‌నుంద‌న్న కోరిక‌ను వెలిబుచ్చింది.

అథ్లెట్‌ అశ్వ‌ని నాచ‌ప్ప - బాక్స‌ర్ మేరీకోమ్ వంటి వారిపై సినిమాలు తీశారు. అవి ప్ర‌జ‌ల్లో స‌జీవంగా నిలిచాయి. క‌మ‌ర్షియ‌ల్‌ గానూ బ్లాక్‌ బ‌స్ట‌ర్లు కొట్టాయి. వీటిలో జీవం ఉంటుంది. ఒక మ‌నిషి లైఫ్‌ ఉంటుంది. స్ఫూర్తినిచ్చే విష‌యం ఆట్టుకుంటుంది. అందుకే జ‌నం ఆ సినిమాల్ని అంత‌గా ఆద‌రించారు. మ‌న ద‌ర్శ‌కులెవ‌రైనా అథ్లెట్‌ పై బ‌యోపిక్ తెర‌కెక్కిస్తే అందులో నాకు అవ‌కాశం ఇస్తార‌ని ఆశిస్తున్నాను అని అంది. త‌న‌కు క్రీడా నేప‌థ్యం ఉంది కాబ‌ట్టి సులువుగా ఆ పాత్ర‌లోకి ప‌ర‌కాయ‌ప్ర‌వేశం చేయ‌గ‌ల‌న‌ని అంది. మేరీకోమ్‌ - చ‌క్ దె ఇండియా లాంటి సినిమాలు అంటే త‌న‌కు ఇష్ట‌మ‌ని చెప్పింది. అన్న‌ట్టు హైద‌రాబాడీ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ బ‌యోపిక్‌ లో చాన్స్‌ శ్ర‌ద్ధా క‌పూర్‌ కే ఎందుకివ్వాలి?  చాందిని లాంటి ఎంథుసియాస్టిక్ తెలుగ‌మ్మాయికి ఇవ్వొచ్చు క‌దా? క‌నీసం ఇక‌పైనైనా క్రీడాకారిణుల బ‌యోపిక్ తెర‌కెక్కిస్తే చాందిని చౌద‌రిని మ‌న ద‌ర్శ‌కులు దృష్టిలో పెట్టుకుంటారనే భావిద్దాం. పీవీ సింధు, క‌ర‌ణం మ‌ల్లీశ్వ‌రిపై సినిమాలు తీస్తే అవ‌కాశం ఇస్తారేమో?
Tags:    

Similar News