చందు చేతిలో రెండు అస్త్రాలు

Update: 2019-01-26 13:24 GMT
నిఖిల్ కి కెరీర్ బెస్ట్ కార్తికేయని తన డెబ్యు మూవీతోనే ఇచ్చిన దర్శకుడు చందు మొండేటికి గత ఏడాది వచ్చిన సవ్యసాచి ఫలితం నిరాశ కలిగించినా తిరిగి బౌన్స్ బ్యాక్ అయ్యేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నాడు . గీతా ఆర్ట్స్ బ్యానర్ లో సాయి ధరం తేజ్ హీరోగా ఒక ప్రతిపాదన ఉండగా సుధాకర్ నిర్మాతగా శర్వానంద్ తో మరో ప్రాజెక్ట్ లైన్ లో ఉంది. అయితే ఏది ముందు మొదలవుతుందో అనే క్లారిటీ ఇంకా రావాల్సి ఉంది. ప్రస్తుతం తేజు మైత్రి సంస్థ నిర్మిస్తున్న చిత్రలహరి షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఏప్రిల్ 12 రిలీజ్ డేట్ ఫిక్స్ చేసారు కాబట్టి మార్చి చివరికంతా షూటింగ్ పూర్తయిపోతుంది.

దీని తర్వాత ఎవరికి కమిట్ అయినట్టు ఇప్పటికైతే సమాచారం లేదు. సో ఫస్ట్ ఆప్షన్ తేజు అనే మాటను కొట్టిపారేయలేం. మరోవైపు శర్వానంద్ సుధీర్ వర్మతో చేస్తున్న మూవీ పూర్తి కాగానే దిల్ రాజు నిర్మాణంలో 96 రీమేక్ కోసం జాయిన్ అవుతాడు. అదీ త్వరగానే పూర్తవుతుంది కాబట్టి దసరాలోపే ఫ్రీ అవ్వొచ్చు. ఒకవేళ సాయి ధరం తేజ్ ది కనక లేట్ అయితే కొంత ఆలస్యం అయినా శర్వాది లైన్ లోకి వస్తుంది.

అయితే ఇదంతా అధికారికంగా బయటికి రావడానికి కొంత టైం పడుతుంది. చందు మొండేటి స్క్రిప్ట్స్ రాసుకోవడంలో బిజీగా ఉన్నాడు. ఇద్దరు హీరోలకు సరిపడా సబ్జెక్ట్స్ రెడీ గా ఉన్నాయని సమాచారం. తన శైలిని మిస్ కాకుండా వినూత్నమైన లైన్స్ సిద్ధం చేసినట్టు తెలిసింది. ఆ మధ్య నిఖిల్ తో కార్తికేయ 2 అనే మాట వచ్చింది కాని అది ఈ రెండు సినిమాల తర్వాత ఉండే అవకాశం ఉంది. సో ఈ సీక్వెల్ సంగతి పక్కన పెడితే ఇప్పుడు చందు చేయబోయేది తేజుతోనా లేక శర్వాతోనా అనే సస్పెన్స్ మరికొద్ది రోజుల్లో తేలిపోవచ్చు.


Tags:    

Similar News