రాజకీయ నాయకుల దగ్గర సినిమాల గురించి ప్రస్తావించామనుకోండి. ``ఆ సినిమాలేంటో ఆ గోలేంటో మాకేం తెలియదు. అసలు సినిమా చూసి ఎన్ని రోజులైందో మాకే గుర్తు లేదు`` అని సమాధానమిస్తుంటారు. నటులు నాయకులవుతున్నప్పటికీ సినిమాకీ, రాజకీయానికీ అంత దూరం ఉంటుందన్నమాట. అయితే `బాహుబలి` మాత్రం సినిమా పరిశ్రమనీ, రాజకీయ వర్గాల్ని ఏకం చేసింది. అందుకే ఇప్పుడు ఎవ్వరి నోట చూసినా బాహుబలి మాటే. ఎప్పుడూ లేని విధంగా ఒక సినిమా గురించి రాజకీయ నేతలు కూడా స్పందిస్తున్నారు. అంతా కూడబలుక్కొని సినిమా చూడ్డానికి వెళుతున్నారు. టిక్కెట్ల కోసం తమ రాజకీయ పరపతిని కూడా వాడుకొంటున్నారు. `బాహుబలి` అంతటి క్రేజ్‌ని తీసుకొచ్చింది.
ఇప్పుడు ఆ చిత్రం గురించి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా స్పందించారు. `బాహుబలి`లాంటి మాస్టర్ పీస్ తీసినందుకు అభినందనలు అంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజమౌళికి ట్విట్టర్ ద్వారా అభినందనలు తెలియజేశారు. తెలుగు ఖ్యాతిని ప్రపంచస్థాయికి తీసుకెళ్లారని ఆయన రాజమౌళిని కీర్తించారు. వెంటనే రాజమౌళి కూడా స్పందించారు. ``కృతజ్జతలు సర్... మీ అభినందనలకు మా చిత్రబృందమంతా పొంగిపోతోంది`` అంటూ ట్వీట్ చేశారు రాజమౌళి. ఒక ముఖ్యమంత్రి ఇలా సినిమా విజయాన్ని కీర్తిస్తూ అభినందించడం ఎంత గ్రేట్ కదూ! మొత్తమ్మీద రాజమౌళి `బాహుబలి`తో ఓ వెలుగు వెలిగిపోతున్నాడు.