ఆర్తి అగ‌ర్వాల్ దుస్థితికి అత‌నే కార‌ణం!.. నిర్మాత సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!

Update: 2021-04-21 23:30 GMT
త‌న అందంతో, అభిన‌యంతో..  తెలుగు సినీ వినీలాకాశంలో అన‌తి కాలంలోనే ధృవ‌తార‌గా వెలిగింది ఆర్తి అగ‌ర్వాల్‌. 'నువ్వునాకు న‌చ్చావ్' చిత్రంతో టాలీవుడ్ కు పరిచయమైన ఆర్తి.. ఫస్ట్ మూవీతోనే సూపర్ హిట్ సొంతం చేసుకుంది. దీంతో.. ఇక వెనుతిరిగి చూడాల్సిన అవసరమే రాలేదు.

చిరంజీవి, బాలకృష్ణ‌, నాగార్జున వంటి సీనియ‌ర్ హీరోల‌తోపాటు.. టాప్ స్టార్స్ అంద‌రితో క‌లిసి న‌టించింది. శ‌ర‌వేగంగా అగ్ర‌హీరోయిన్ గా ఎదిగింది ఆర్తి అగ‌ర్వాల్‌. అయితే.. ఆ స‌మ‌యంలోనే ఆత్మ‌హ‌త్యా య‌త్నం చేయ‌డం క‌ల‌క‌లం రేపింది. చాలా కాలం త‌ర్వాత వెయిట్ లాస్ అయ్యేందుకు చేయించుకున్న ఆప‌రేష‌న్ విక‌టించి, 2015లో ప్రాణాలు కోల్పోయింది ఆర్తి.

అయితే.. తాజాగా ఆర్తి అగ‌ర్వాల్ ప‌రిస్థితిపై నిర్మాత చంటి అడ్డాల షాకింగ్ కామెంట్స్ చేసిన‌ట్టు సోష‌ల్ మీడియాలో ప్ర‌చారం సాగుతోంది. దీంతో.. ఆర్తి అగ‌ర్వాల్ జీవితం మ‌రోసారి వార్త‌ల్లో నిలిచింది. ఇంతకీ ఆయ‌న ఏమ‌న్నారో చూద్దాం.

''పేరెంట్స్ లొకేష‌న్ కు రానంత వ‌ర‌కు ఆర్తి అగ‌ర్వాల్ కన్వినెంట్ గా ప‌నిచేసేది. వాళ్లు వ‌స్తే మాత్రం.. ఈమెతో ప‌ని చేయ‌నిచ్చే వారు కాదు. ఆర్తి అగ‌ర్వాల్ తండ్రి ప్ర‌తీదానికి అడ్డుప‌డేవాడు. చివ‌ర‌కు షూటింగ్ ప్యాక‌ప్ ఎప్పుడు చెప్పాలో కూడా ఆయ‌నే డిసైడ్ చేసేవాడు. ఫాద‌ర్ వ‌ల్ల‌నే ఆర్తి అగ‌ర్వాల్ ఇబ్బంది ప‌డేది. ఆయ‌న లేక‌పోతే ఆమె ఫ్రీగా ప‌నిచేసేది. నిజానికి ఆమె కెరీర్ ఫేడ్ ఔట్ అయిపోవ‌డానికి ఆమె తండ్రే కార‌ణం'' అంటూ సంచలన వ్యాఖ్యలు చేసినట్టు సమాచారం
Tags:    

Similar News