పెను దుమారం రేపుతున్న డ్రగ్స్ విచారణ కేసులో మరో సినీ ప్రముఖులు సిట్ విచారణకు హాజరయ్యారు. ఇప్పటివరకూ నోటీసులు అందుకున్న వారికి భిన్నంగా కోర్టును ఆశ్రయించి.. కోర్టు నుంచి కొన్ని సూచనలు అందుకున్న ఛార్మి విచారణ కోసం సిట్ కార్యాలయానికి వచ్చారు. ఈ రోజు ఉదయం 9.45 గంటలకు టయోటా కారులో ఆమె సిట్ కార్యాలయానికి చేరుకున్నారు.
వెంట బౌన్సర్లు రాగా.. కారు నుంచి దిగిన ఆమె సిట్ కార్యాలయంలోకి కొందరు ముఖ్యులతో కలిసి వచ్చారు. ఇప్పటివరకూ విచారణకు హాజరైన వారికి భిన్నంగా బ్లూ కలర్ టాప్ తో ఛార్మి హాజరయ్యారు. కారు నుంచి దిగిన సందర్భంలో ఛార్మి ముఖంలో నవ్వు కనిపించినప్పటికీ.. కాసేపటికే ఆమె ముఖంలో కాస్తంత టెన్షన్ కొట్టొచ్చినట్లు కనిపించింది. కారు దిగి సిట్ కార్యాలయం లోపలకు వెళుతున్న ఛార్మిని ఫోటోలు తీసేందుకు పలువురు పోటీ పడ్డారు. ఇక.. మీడియా ప్రతినిధుల హడావుడి చెప్పాల్సిన అవసరమే లేదు. ఛార్మికి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు పోలీసులు తీవ్ర ప్రయాసకు గురయ్యారు.
ఛార్మి విజువల్స్ చేజిక్కించుకునేందుకు మీడియా ప్రతినిధుల మధ్య విపరీతమైన పోటీ నెలకొనటంతో కొద్దిపాటి గందరగోళం చోటు చేసుకుంది. ఛార్మి వెంట మహిళా పోలీసు అధికారులు ఉన్నప్పటికీ.. సిట్ కార్యాలయం లోపలకు వెళ్లే సమయంలో చిన్నపాటి తోపులాట చోటు చేసుకుంది. దీంతో.. ఛార్మి అసౌకర్యానికి గురైనట్లుగా కనిపించింది. ముందుకు వెళుతున్న ఆమె.. తనను నెట్టటంతో ఒక్కసారి ఆగి.. వెనక్కి తిరిగి చూసి మళ్లీ ముందుకు కదిలారు. ఈ సందర్భంగా ఆమె ముఖంలో కాస్త టెన్షన్.. గందరగోళం.. బెరుకు స్పష్టంగా కనిపించింది. కోర్టు ఆదేశాల ప్రకారం ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు మాత్రమే విచారించాల్సి ఉంటుంది. ఒకవేళ విచారణ పూర్తి కాని పక్షంలో మరో రోజు కూడా ఆమెను విచారించొచ్చని న్యాయస్థానం వెల్లడించిన నేపథ్యంలో ఆమెను సిట్ అధికారులు ఎన్ని రోజులు విచారిస్తారు? అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. ఇక.. ఛార్మిని విచారించేందుకు వీలుగా నలుగురు మహిళా అధికారిణులను సిట్ ఏర్పాటు చేసినట్లు చెబుతున్నారు.