ఛార్మి ఇచ్చే రిపోర్టులు అదిరాయ్

Update: 2017-08-20 09:13 GMT
ఒక సినిమాకు సంబంధించిన ప్రొడక్షన్ పనులు చూసుకుంటోంది అనుకుంటే.. ఆ సినిమా షూటింగ్ జరిగేటప్పుడు ఆ సినిమాకు కావల్సిన ఏర్పాట్లను చేస్తోంది అనుకుంటారు జనాలు. కాని హీరోయిన్ ఛార్మి మాత్రం ఒక నిజమైన ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ లెవెల్లో మారిపోయింది. తన హీరోయిన్ స్టాటస్ పక్కనెట్టేసి పక్కా ఫిలిం ప్రొడ్యూసర్ స్టయిల్లో పనిచేస్తోందీ అమ్మడు.

నిజానికి పూరి కనక్ట్స్ పేరుతో కేవలం మోడళ్ళను మాత్రమే కో-ఆర్టినేట్ చేస్తుందని అనుకుంటే.. ఛార్మి మాత్రం పూరి జగన్ కు ''పైసా వసూల్'' సినిమా తీయడానికి పూర్తి స్థాయిలో సహకారం అందిస్తోంది. అంతేకాక మొన్న ఖమ్మంలో జరిగిన ఆడియో ఫంక్షన్ కూడా ఆమే ఆర్గనైజ్ చేసిందట. అలా చేస్తూనే ఇప్పుడు ఈ సినిమా గురించి అప్డేట్లు కూడా బాగానే ఇస్తోంది. డైరక్టుగా రీ-రికార్డింగ్ స్టూడియోలో బ్యాగ్రౌండ్ స్కోర్ వర్క్ జరుగుతుంటే.. అనూప్ రూబెన్స్ కష్టపడుతున్నాడంటూ అక్కడి నుండి ఒక అప్డేట్ ఇచ్చేసింది ఛార్మి. ఇలాంటి రిపోర్టులు సినిమా లవ్వర్స్ ను భలే అలరిస్తాయి అనడంలో అతిశయోక్తి లేదులే.

ఇకపోతే నందమూరి బాలకృష్ణ లీడ్లో శ్రీయ - ముస్కాన్ - కైరా దత్ హీరోయిన్లుగా రూపొందుతున్న సినిమా పైసా వసూల్. సెప్టెంబర్ 1న రిలీజ్ కానుంది. ఆల్రెడీ నందమూరి ఫ్యాన్స్ ట్రైలర్లో బాలయ్య డైలాగులు చూసి సంబరాలు చేసుకుంటున్నారులే. ఇక ఈ సినిమాకు ఈ మధ్యన కాంట్రోవర్శీలతో కూడా బాగానే హైప్ వస్తోంది. అది సంగతి. 
Tags:    

Similar News