స్పీడ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తాజా సినిమా -జ్యోతిలక్ష్మి. ఛార్మి కథానాయికగా నటిస్తోంది. సినిమా కథానాయికలంటే ఎందుకంత చులకన భావం? అలాంటివారి తాట తీస్తాం.. అని జనాలకు వార్నింగ్ ఇస్తున్నారు ఈ సినిమాలో. ఈ సంగతిని నిర్మాత సి.కళ్యాణ్ స్వయంగా చెప్పారు. ఇదో మహిళా ప్రధాన చిత్రం. మహిళలు ఏ రంగంలో ఉన్నా కించపరిచే స్వభావం ఉన్న మగాళ్లకు వాతలు వేస్తామని చెప్పారు. జ్యోతిలక్ష్మి రెగ్యులర్ చిత్రీకరణ మార్చి 1న ప్రారంభమైంది. శరవేగంగా చిత్రీకరణ సాగుతోంది. ఇప్పటికే తొలిషెడ్యూల్ పూర్తి చేశారు. జ్యోతిలక్ష్మి అంటే అలనాటి డ్యాన్సర్ జ్యోతిలక్ష్మి అని అనుకునేరు. అస్సలు ఆ జ్యోతిలక్ష్మికి ఈ జ్యోతిలక్ష్మికి అస్సలు సంబంధమే లేదు. ఇది ఓ సినిమా నటికి సంబంధించిన కథాంశం మాత్రమే. సమాజంపై, పురుష పుంగవులపై సెటైరికల్‌గా ఉంటుంది. నటీమణుల్ని అవమానించే వారికి గుణపాఠం చెప్పే జ్యోతిలక్ష్మి కథ ఇది.. అంటూ కథ గురించి ఇప్పటికే గుట్టు విప్పారు. సునీల్ కశ్యప్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. సి.కళ్యాణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవలే రిలీజైన జ్యోతిలక్ష్మి టీజర్‌కి జనాల్లో విశేష స్పందన వచ్చిన సంగతి తెలిసిందే. నిమిషం వీడియోలో ఛార్మి గజగజలాడించింది. అంతకు ముందెన్నడూ లేనంత వేడి మీద కనిపించింది.