వ్యక్తిగత జీవితంపై ప్రశ్నలను తప్పించుకుంటున్న చై-సామ్..?

Update: 2022-07-20 02:30 GMT
సౌత్ ఇండస్ట్రీలోని మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్స్ లో ఒకరిగా పేరు తెచ్చుకున్న అక్కినేని నాగ చైతన్య - సమంత జంట విడిపోయిన సంగతి తెలిసిందే. 2017లో ప్రేమ వివాహం చేసుకున్న చై సామ్.. నాలుగో యానివర్సరీ రాకముందే విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించారు. పరస్పర అంగీకారంతోనే ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం ఇద్దరూ వేర్వేరు మార్గాల్లో జీవితాన్ని సాగిస్తున్నారు. అయితే ఇది జరిగి చాలా కాలం అయినా వీరు ఎక్కడికి వెళ్లినా డివోర్స్ కు సంబంధించిన ప్రశ్నలు ఎదురవుతూనే ఉన్నాయి.

నాగచైతన్య ఇప్పుడు 'థాంక్యూ' ప్రమోషన్స్ లో బిజీగా వున్నాడు. దిల్ రాజు నిర్మాణంలో విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ఇది. ఈ నెల 22న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో జెట్ స్పీడ్ తో ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు చైతూ. అయితే వీటిల్లో తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ప్రశ్నలు రాకుండా ఉండేలా యువసామ్రాట్ జాగ్రత్తలు తీసుకుంటున్నారని తెలుస్తోంది.

'థాంక్యూ' ప్రమోషన్స్ లో భాగంగా నాగచైతన్య తాజాగా వెబ్ మీడియాతో ముచ్చటించారు. సమంత తో విడాకులు మరియు హీరోయిన్ శోభిత ధూళిపాళతో ఎఫైర్ రూమర్స్‌ గురించి చై ప్రశ్నలు ఎదుర్కొంటారని అందరూ అనుకున్నారు. అయితే వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఎటువంటి ప్రశ్నలు వేయవద్దని ముందుగానే అతని బృందం పాత్రికేయులను రిక్వెస్ట్ చేసినట్లు తెలుస్తోంది.

నిజానికి 'లవ్ స్టోరీ' సినిమా టైంలో కూడా నాగచైతన్య తన పర్సనల్ మ్యాటర్ గురించి ప్రశ్నలు ఎదుర్కోవాల్సి వచ్చింది. అప్పటికి చై సామ్ విడిపోతున్నట్లు అధికారికంగా ప్రకటించలేదు. అందుకే అప్పుడు వ్యక్తిగత ప్రశ్నలు అడగకుండా చూసుకున్నారు. అలానే 'బంగార్రాజు' మూవీ ప్రమోషన్స్ లో సైతం చై ఇలాంటి ప్రశ్నలనే ఫేస్ చేయాల్సి వచ్చింది. అయితే ఈసారి తప్పించుకోవాలని చూడలేదు.

ఇద్దరం పరస్పర అంగీకారంతోనే విడాకులు తీసుకున్నట్లు తెలిపారు. సామ్ హ్యాపీగా ఉందని.. తను కూడా హ్యాపీ అని చైతూ చెప్పాడు. ఇప్పుడు శోభిత తో డేటింగ్ చేస్తున్నాడనే రూమర్స్ వస్తున్న నేపథ్యంలో మీడియా నుంచి ఆ ప్రశ్నలు అడగకుండా చూసుకుంటున్నారని తెలుస్తోంది.

మరోవైపు సమంత సైతం తన విడాకుల వ్యవహారం పై ప్రశ్నలను అవైడ్ చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఇప్పటికే చైతూ తో విడిపోవడం గురించి సామ్ పరోక్షంగా మాట్లాడింది. బ్రేకప్‌ ను అధిగమించడం చాలా కష్టమని.. అది తనని మానసికంగా దెబ్బతీసిందని చెబుతూ వచ్చింది. ఇప్పుడు లేటెస్టుగా కరణ్ జోహార్ టాక్ షో 'కాఫీ విత్ కరణ్' లో కచ్చితంగా విడాకులపై నోరు విప్పుతుందని అందరూ భావించారు.

కానీ లేటెస్టుగా విడుదల చేసిన సమంత ఎపిసోడ్ ప్రోమోలో ఆమె విడాకుల గురించి చర్చను తప్పించుకోడానికి ట్రై చేసినట్లు తెలుస్తోంది. కరణ్ తన పెళ్లి గురించి ఆమెను అడిగినప్పుడు, సమంతా "అసంతృప్తికరమైన వివాహాలకు కారణం మీరే" అంటూ కరణ్ ను ఉద్దేశిస్తూ సమాధానం చెప్పింది. పెళ్లి ప్రస్తావన తెచ్చిన వెంటనే సమంత టాపిక్ డైవర్ట్ చేస్తూ కనిపిస్తుంది. దీనిని బట్టి ఇద్దరూ తమ వ్యక్తిగత విషయాల గురించి మళ్లీ మాట్లాడటానికి సిద్ధంగా లేరని స్పష్టంగా తెలుస్తోంది.
Tags:    

Similar News