#ఆస్క్ చై సామ్: సలహాలు కావాలా నాయనా?

Update: 2019-03-13 12:02 GMT
ప్రతి విషయానికి మనోళ్ళకు గూగులమ్మను ఆడడం బాగా అలవాటైపోయింది.  'హౌ టు' అనే పదాన్ని విపరీతంగా వాడతారట మన నెటిజనులు.  హౌ టూ కిస్ దగ్గరనుండి మొదలు పెట్టి 'హౌ టూ ఎర్న్ మనీ' దాకా అన్నీ ప్రశ్నలు గూగుల్ కే.  విద్యార్థులకు ఎప్పుడో ఏడాదికి ఒకసారి పరిక్షలు ఉంటాయి.  గూగుల్ కు అనుక్షణం ఒక టెస్టే.  ప్రశ్నలనేవి అందరినీ ఇబ్బంది పెట్టవు లెండి.. కొందరిని ఎలాంటి ప్రశ్నలైనా అడగండి..అడిగినవారికి దిమ్మతిరిగే మైండ్ బ్లాంక్ అయ్యే ఆన్సర్లు ఇవ్వగలరు. అలాంటి వారిలో రామ్ గోపాల్ వర్మ ఒకరు.  కానీ మన టాపిక్ ఇప్పుడు ఆర్జీవీ కాదు.. అక్కినేని వారు.

అక్కినేని నాగ చైతన్య - సమంతా జంటగా 'మజిలీ' అనే చిత్రంలో  నటిస్తున్నారు.  ఈ సినిమా ఏప్రిల్ 5 న ప్రేక్షకుల ముందుకు రానుంది.  దీంతో రీసెంట్ గా ప్రమోషన్స్ లో జోరు పెంచారు. లిరికల్ సాంగ్స్ ను ఒకదాని తర్వాత మరోటి విడుదల చేస్తూ సినిమాపై హైప్ పెంచే ప్రయత్నాలలో ఉన్నారు. ఇంతటితో ఆగకుండా #AskChaySam పేరుతో ఒక ప్రమోషన్ ఈవెంట్ ను రన్ చేస్తున్నారు. ఇందులో భాగంగా నెటిజనులు టాలీవుడ్ క్యూట్ కపుల్ చైతు-సమంతాలను రిలేషన్ షిప్ కు సంబంధించిన సలహాలు సూచనలు అడగొచ్చు.   ప్రేమ.. వివాహం లాంటి విషయాలే ఇందులో ప్రధానంగా ఉండే అవకాశం ఉంది.  

నెటిజనులు తమ ప్రశ్నలను #AskChaySam అనే హ్యాష్ టాగ్ ను జోడించి అడిగితే సమంతా .. చైతూలు ప్రమోషన్స్ సమయంలో జవాబిస్తారు.  ఆల్రెడీ ఒక నెటిజనుడు ప్రశ్న అడగడం దానికి అతనికి సమంతా ఫ్యాన్ అన్సర్ ఇవ్వడం.. ఆ ట్వీట్ ను సమంతా రీ ట్వీట్ చేయడం కూడా జరిగిపోయింది.  ఇంతకీ ఆ ట్వీట్ ఏంటంటే.. "అబ్బాయి అమ్మాయి ఇద్దరూ కనుక లవ్ లో ఉంటే ఇద్దరిలో ఎవరు తమ ఫీలింగ్స్ ను ముందు ఎక్స్ ప్రెస్ చేయాలి?  మీ విషయంలో ఏం జరిగింది?"  దీనికి సమాధానం ఒక అమ్మాయి ఇలా ఇచ్చింది "జవాబు సమంతా ఇచ్చినా సమంతా ఫ్యాన్ ఇచ్చినా ఒకటే.. ఇదిగో ఆన్సర్.   Ans - అబ్బాయిలే ముందు ఎక్స్ ప్రెస్ చేయాలి." 
Tags:    

Similar News