బాలీవుడ్, టాలీవుడ్ లో హీరోయిన్ గా పలు చిత్రాల్లో నటించి మెప్పించిన ముద్దుగుమ్మ అమీషా పటేల్ గత కొన్నాళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటుంది. ఈమె సినిమాల్లో నటించేందుకు ఆసక్తిగా ఉన్నా కూడా అవకాశాలు రావడం లేదు. దాంతో ఈమె ప్రైవేట్ ఈవెంట్స్ లో స్టేజ్ షోలు చేయడంతో పాటు, మోడలింగ్ చేస్తూ అప్పుడప్పుడు సోషల్ మీడియాలో హడావుడి చేస్తూ వస్తోంది. అమీషా పటేల్ గురించి అంతా మర్చి పోతున్న సమయంలో చీటింగ్ కేసు వల్ల ఆమె మీడియా ముందుకు వచ్చింది
పవన్ శర్మ అనే ఈవెంట్ మేనేజర్ అమీషా పటేల్ పై చీటింగ్ కేసు పెట్టాడు. ఒక వివాహ వేడుకలో స్టేజ్ షో చేసేందుకు 11 లక్షల అడ్వాన్స్ ను తీసుకున్న ఈమె ఆ కార్యక్రమానికి రాలేదని, దానికి తోడు మరో రెండు లక్షల రూపాయలు ఇవ్వాల్సిందిగా తనను ఇబ్బంది పెట్టిందంటూ ఆరోపిస్తున్నాడు. 2016 నుండి కూడా ఈ వివాదం నడుస్తోంది. దాదాపు మూడు సంవత్సరాలు అవుతున్నా కూడా అమీషా పటేల్ అతడికి సెటిల్ చేయకపోవడంతో అతడు పోలీసులను ఆశ్రయించాడు.
పోలీసుల కథనం ప్రకారం ఉత్తరప్రదేశ్ లోని మొరాదబాద్ లో ఒక ఈవెంట్ కు అమీషా హాజరు అవుతాను అంటూ పవన్ శర్మ వద్ద అడ్వాన్స్ తీసుకుంది. అయితే ఏవో కారణాలు చూపుతూ ఆ కార్యక్రమానికి హాజరు కాలేదు. దాంతో పవన్ శర్మ తీవ్రంగా నష్టపోయాడట. దానికి తోడు తాను అడ్వాన్స్ ఇచ్చిన అమౌంట్ ను కూడా తిరిగి ఇచ్చేందుకు ఒప్పుకోలేదట. దాంతో ఆమెపై పవన్ శర్మ ఫిర్యాదు ఇచ్చినట్లుగా పోలీసులు చెప్పుకొచ్చారు. ఈ కేసు నుండి అమీషా ఎలా బయట పడుతుందో చూడాలి.