చెలియా.. డిజాస్టర్ కా బాప్..

Update: 2017-04-10 07:31 GMT
కార్తి.. అదితి రావు హైదరి జంటగా నటించిన చెలియా చిత్రం పై.. కొన్ని రోజుల క్రితం వరకు అంచనాలు ఆకాశంలో ఉన్నాయి. మణిరత్నం మూవీ కావడంతో.. మరో క్లాసిక్ మూవీ అందిచబోతున్నాడని అంతా ఎక్స్ పెక్ట్ చేశారు. కానీ రిజల్ట్ మాత్రం చాలా చాలా తేడా కొట్టేసింది. చెలియా మూవీ భారీ డిజాస్టర్ గా నిలిచిపోతోంది.

తెలుగు మార్కెట్లో తొలి రోజు పర్లేదనిపించిన కలెక్షన్స్.. ఆ తర్వాత మరీ దారుణంగా పడిపోయాయి. ఇక ఈ సినిమా కోలుకునే ఛాన్స్ లేదని ట్రేడ్ జనాలు తేల్చేస్తున్నారు. ఓవర్సీస్ లో క్లాస్ మూవీస్ కి విపరీతమైన ఆదరణ ఉంటుందని అంతా అనుకుంటారు. కానీ చెలియా విషయంలో ఆ లెక్కలు కూడా తప్పాయి. తొలి వారాంతం ముగిసే సరికి కనీసం లక్ష డాలర్లను కూడా ఈ సినిమా రాబట్టలేకపోయింది. తమిళ్ వెర్షన్ కాట్రు వెలియిదాయ్ 3.72 లక్షల డాలర్లతో పర్లేదనిపించింది. కానీ చెలియా మాత్రం.. గురువారం ప్రీమియర్స్ నుంచి ఆదివారం వసూళ్ల వరకు కలిపి కేవంల 82 వేల డాలర్ల మార్క్ ను మాత్రమే అందుకోగలిగింది.

అసలు చెలియాపై ఆడియన్స్ నామమాత్రపు ఆసక్తి కూడా చూపలేదనే విషయం తేలిపోతోంది. ఈ చిత్రానికి ప్రమోషన్స్ కూడా అంతంత మాత్రంగానే ఉండడం.. ఏఆర్ రెహమాన్ అందించిన సంగీతం ఆకట్టుకోకపోవడం.. మూవీ ఫెయిల్యూర్ కి ఇతర కారణాలు చెప్పచ్చు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News