త‌క్కువ టైమ్ లో కొత్త ట్యాలెంట్ తో చెర్రీ ప్లాన్

Update: 2021-05-30 04:30 GMT
ప్ర‌స్తుత లాక్ డౌన్ స‌న్నివేశం.. క‌రోనా మ‌హ‌మ్మారీ ప‌ర్య‌వ‌సానం స్టార్ హీరోల ఆలోచ‌న‌ల్ని మార్చేస్తున్న‌ట్టే క‌నిపిస్తోంది. వ‌రుస‌గా పాన్ ఇండియా సినిమాలు చేయాలంటే అది ప్ర‌మాద‌క‌రంగా క‌నిపిస్తోంది. భారీ బ‌డ్జెట్ల‌తో సాహ‌సాలు ఈ సీజ‌న్ లో పెను ముప్పుగా మారింది. పాన్ ఇండియా కేట‌గిరీ అంటే తెలుగు రాష్ట్రాలు స‌హా దేశ విదేశాల్లో బాక్సాఫీస్ వ‌ద్ద స‌త్తా చాటాల్సి ఉంటుంది. కానీ ఇప్పుడున్న స‌న్నివేశంలో అది సాధ్య‌మేనా? అన్న‌ది పున‌రాలోచించుకోవాల్సిన ప‌రిస్థితి ఉంది.

క‌రోనా మ‌హ‌మ్మారీ ప‌ర్య‌వ‌సానం ఇంకా ఎంత కాలం ఉంటుందో అర్థం కాని గంద‌ర‌గోళం నెల‌కొంది. అందుకే ఇప్పుడు స్టార్ హీరోలు చిన్న బ‌డ్జెట్ లో మంచి క‌థ‌ల‌ను ఎంపిక చేసుకుని చిన్న స్థాయి ద‌ర్శ‌కులు కొత్త వారితో ప్ర‌యోగాలు చేసేందుకు ప్లాన్ చేస్తున్నార‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.

రామ్ చరణ్ ఈ త‌ర‌హా ఆలోచ‌న చేస్తున్నార‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. అత‌డు ఆర్.ఆర్.ఆర్ లాంటి పాన్ ఇండియా సినిమా త‌ర్వాత కంటెంట్ కి న‌ట‌న‌కు ఆస్కారం ఉన్న చిన్న సినిమా చేసే ఆలోచ‌న‌లో ఉన్నారు. క్రియేటివిటీకి ప‌దును పెట్టే న‌వ‌త‌రం ద‌ర్శ‌కుల‌కు ఇది మంచి అవ‌కాశం గా మార‌నుంది. ఏదైనా స్క్రిప్ట్ డిసైడ్ చేస్తుంది. ఇది ప‌రిమిత బ‌డ్జెట్లో పూర్త‌య్యి ఓటీటీ స‌హా ఇత‌ర ప్ర‌క్రియ‌ల ద్వారా మంచి మార్చెట్ చేసేదిగా గిట్టుబాటు అయ్యేదిగా ఉండాల‌నేది ప్లాన్. ఇది వ‌ర్క‌వుటైతే ఎంత పెద్ద భారీ చిత్రాలు చేసినా.. త‌క్కువ స‌మ‌యంలో పూర్త‌య్యే సినిమాల్ని మ‌రోవైపు వేగంగా పూర్తి చేసేందుకు ఆస్కారం ఉంటుంద‌నేది ఆలోచ‌న‌.

చరణ్ ఇటీవ‌ల‌ కొంతమంది న‌వ‌త‌రం దర్శకులను ఆహ్వానించార‌ట‌. రోబో శంకర్ తో తన చిత్రం ఆలస్యం అయినట్లయితే అతను ఈ చిత్రాన్ని వెంట‌నే ప్రారంభిస్తారు. ప‌రిమిత బ‌డ్జెట్లో త‌క్కువ స‌మ‌యంలో పూర్త‌య్యేలా ఈ చిత్రం ఉంటుంద‌ట‌. అయితే జాక్ పాట్ కొట్టే ట్యాలెంటెడ్ డైరెక్ట‌ర్ ఎవ‌రు? అన్న‌ది వేచి చూడాలి.
Tags:    

Similar News