మానవత్వం అంటూ వ్యాపారం చేస్తున్నారు

Update: 2016-02-19 06:23 GMT
ప్రస్తుతం కొన్ని ఛానల్స్ లో వస్తున్న మానవత్వం బేస్డ్ కాన్సెప్ట్ రియాలిటీషోలకు విపరీతమైన ప్రేక్షకాదరణ లభిస్తోంది. సీనియర్ నటీమణులు సుమలత - జీవిత - జయసుధలు నిర్వహిస్తున్న కార్యక్రమాలకు టీఆర్పీ రేటింగులు అదిరిపోయేలా ఉంటున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లోని కొందరి కాపురాల్లో  గొడవలను బుల్లితెరపై చూపిస్తూ.. బోలెడంత సొమ్ము చేసుకుంటున్నారు నటీ మణులు, ఛానల్సు.

ఛానళ్లకు టీఆర్పీలు - యాడ్స్ ముఖ్యం. వాళ్లకు అది బిజినెస్. హోస్టింగ్ చేసే వాళ్లకు రెమ్యూనరేషన్ ముడుతుంది. అందులో పాల్గొన్నవారికి చివరకు ఏదన్నా పరిష్కారం దొరకచ్చు, దొరక్కపోనూ వచ్చు. ఈ రియాలిటీ షో కారణంగా వారంతా మారిపోతారని అనుకోవడానికి లేదు. కానీ ఇలాంట షోల కారణంగా సమాజంపై దుష్ప్రభావం పడుతుందని ఇప్పుడు లోకాయుక్తకు కంప్లెయింట్ అందింది. ముఖ్యంగా ఈ గొడవల్లోకి పసివారిని కూడా లాగుతున్న వైనం ఇక్కడ ఫిర్యాదులో ప్రధాన అంశంగా కనిపిస్తోంది.

చిన్న పిల్లలు ఏడుస్తుడడం, వారి మొహాలపై కెమేరాలు జూమ్ చేసి స్లోమోషన్ లో చూపించడం లాంటివి.. ఖచ్చితంగా బాల్యంపై ప్రభావం చూపించేవే. వీటికి లోకాయుక్త ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో ఇప్పుడే చెప్పలేం కానీ.. ఈ కంప్లెయింట్ తర్వాత.. ఈ రియాలిటీ షోలకు మరింత ఆదరణ దక్కడం మాత్రం ఖాయమే.

Tags:    

Similar News