ఏదైనా ఒక సినిమాను తీసుకుంటే ఆ సినిమాకు దర్శకుడు, సంగీత దర్శకుడు, ఎడిటింగ్, సినిమాటోగ్రాఫర్ ఇలా వివిధ విభాగాలకు ఒక్కొక్కరు చొప్పున టెక్నీషియన్స్ ఉంటారు. చాలా అరుదుగా మాత్రమే ఒక్కరికి మించి ఉంటారు. కొన్ని సినిమాలకు ఇద్దరు ముగ్గురు దర్శకత్వం చేయడం, కొన్ని సినిమాలకు ఇద్దరు ముగ్గురు సంగీతాన్ని అందించడం జరుగుతుంది. కాని ఒకే సినిమాకు ఆరుగురు సంగీత దర్శకులు - ఆరుగురు సినిమాటోగ్రాఫర్ లు - ఆరుగురు ఎడిటర్ లు వర్క్ చేయడం ఇప్పటి వరకు ఇండియన్ సినీ చరిత్రలో ఎప్పుడు జరగలేదు.
మొదటి సారి ఒక తమిళ సినిమాకు ఇది జరుగబోతుంది. శంకర్ శిష్యుడు చింబుదేవన్ దర్శకత్వంలో రూపొందుతున్న 'కసాడ తబార'. ఈ చిత్రం కథ చాలా విభిన్నంగా ఉంటుంది. ఈ చిత్రంలో ఆరు పోర్షన్ లలో కథ ఉంటుంది. ఆరు పోర్షన్ లకు గాను ఆరుగురు దర్శకులు స్క్రీన్‌ప్లే అందించారు. సినిమా ఆరు పోర్షన్ లకు గాను ఆరుగురు సంగీత దర్శకులు, వేరు వేరుగా సినిమాటోగ్రాఫర్స్, ఎడిటర్స్ వర్క్ చేయబోతున్నారు. అది కూడా చిన్నా చితకా టెక్నీషియన్స్ కాదు.
ఈ చిత్రం కోసం ప్రముఖ సంగీత దర్శకులు అయిన యువన్ శంకర్ రాజా.. సీన్ రొనాల్డ్.. ప్రేమ్ జీ.. శామ్.. సంతోష్ నారాయణ్.. జిబ్రాన్ లు సంగీతం అందిస్తున్నారు. విజయ్ తో పులి అనే భారీ చిత్రాన్ని తెరకెక్కించి దెబ్బ తిన్న దర్శకుడు చింబుదేవన్ ఈ చిత్రంతో ప్రయోగంను చేస్తున్నాడు. ఈ చిత్రం గురించి ప్రస్తుతం తమిళ సినీ వర్గాల్లోనే కాకుండా సౌత్ ఇండియా మొత్తం కూడా చర్చించుకుంటున్నారు. భారీ బడ్జెట్ తో దర్శకుడు వెంకట్ ప్రభు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు.
ఇలాంటి విభిన్నమైన పోర్షన్ లతో సినిమాలు హాలీవుడ్ మరియు బాలీవుడ్ లో ఎక్కువగా వచ్చాయి. సౌత్ లో మొదటి సారి ఇలాంటి ప్రయోగాత్మక చిత్రం రాబోతుంది. చాలా ప్రత్యేకమైన చిత్రంగా గుర్తింపు దక్కించుకున్న ఈ చిత్రం ఆడియన్స్ నుండి ఎలాంటి రియాక్షన్ ను దక్కించుకుంటుందా అనేది చూడాలి.