చిత్రం : ‘చినబాబు’
నటీనటులు: కార్తి - సాయేషా సైగల్ - సత్యరాజ్ - భానుప్రియ - శత్రు - ప్రియ భవానీ శంకర్ - సూరి తదితరులు
సంగీతం: డి.ఇమాన్
ఛాయాగ్రహణం: వేల్ రాజ్
నిర్మాతలు: సూర్య - మిర్యాల రవీందర్ రెడ్డి
రచన - దర్శకత్వం: పాండిరాజ్
అన్న సూర్య బాటలోనే తెలుగులో మంచి ఫాలోయింగ్ సంపాదించిన తమిళ నటుడు కార్తి. మధ్యలో కొంచెం ట్రాక్ తప్పినా.. ‘ఊపిరి’.. ‘ఖాకి’ సినిమాలతో మళ్లీ గాడిన పడ్డాడు. ఇప్పుడతను ‘చినబాబు’గా తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చాడు. పల్లెటూరి నేపథ్యంలో పాండిరాజ్ రూపొందించిన ఈ చిత్ర విశేషాలేంటో చూద్దాం పదండి.
కథ:
కృష్ణంరాజు అలియాస్ చినబాబు (కార్తి) ఒక రైతు బిడ్డ. అతడిది చాలా పెద్ద కుటుంబం. ఐదుగురు అక్కల ముద్దుల తమ్ముడైన చినబాబును కుటుంబమంతా చాలా ప్రేమగా చూసుకుంటుంది. ఐతే చినబాబును తమ ఇంటి అల్లుడిగా చేసుకోవాలని ఇద్దరు అక్కలు ఆశపడతారు. వాళ్ల కూతుళ్లు కూడా అతడిని ఇష్టపడతారు. కానీ చినబాబు మాత్రం నీరజ (సాయేషా) అనే వేరే అమ్మాయిని ఇష్టపడతాడు. ఆమెనే పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. దీంతో కుటుంబంలో గొడవలు మొదలవుతాయి. చినబాబు కారణంగా దెబ్బ తిన్న నీరజ మావయ్య కుటుంబంలో గొడవల్ని మరింత పెద్దవి చేస్తాడు. దీంతో చినబాబు కుటుంబమంతా చిన్నాభిన్నమవుతుంది. చినబాబు సమస్యల సుడిగుండంలో చిక్కుకుంటుంది. ఈ స్థితిలో చినబాబు ఈ సమస్యలన్నింటినీ ఎలా పరిష్కరించుకున్నాడు.. తిరిగి కుటుంబాన్ని ఎలా కలిపాడు అన్నది మిగతా కథ.
కథనం - విశ్లేషణ:
90లు.. అంతకంటే ముందు దక్షిణాదిన పల్లెటూరి కథలు బోలెడన్ని వచ్చేవి. హీరోలు రైతు పాత్రలు వేసేవాళ్లు. కానీ తర్వాత తర్వాత ఆ నేపథ్యంలో సినిమాలు బాగా తగ్గిపోయాయి. ఈ తరం హీరోల్ని అసలు రైతులుగానే ఊహించుకోలేకపోతున్నాం. ఇలాంటి తరుణంలో తమిళ కథానాయకుడు కార్తి రైతు అవతారం ఎత్తాడు. కెరీర్లో తొలిసారి పూర్తి స్థాయి గ్రామీణ చిత్రంలో నటించాడు. ఈ తరహా సినిమాలకు పూర్తిగా దూరమైపోయిన ప్రేక్షకులకు ఇది కొంచెం విభిన్నంగా అనిపిస్తుంది. రైతు.. వ్యవసాయం.. ఉమ్మడి కుటుంబం.. అందులో అనురాగాలు ఆప్యాయతల నేపథ్యంలో చాలా స్వచ్ఛంగా సాగే సినిమా ‘చినబాబు’. కాకపోతే విపరీతమైన మెలోడ్రామా.. ఓవర్ డోస్ సెంటిమెంటు కారణంగా ‘చినబాబు’ ఒక దశ దాటాక డ్రామాలా కనిపిస్తుంది. తమిళ నేటివిటీ కూడా బాగా దట్టించడం మరో సమస్య. ఈ రెండు ఇబ్బందుల్ని తట్టుకోగలిగితే ‘చినబాబు’ ఓకే అనిపిస్తుంది.
ఈ తరం యువత ఎలా అయితే వ్యవసాయాన్ని వదిలేసి నగర బాట పట్టిందో.. సినీ రచయితలు.. దర్శకులు సైతం పల్లెటూరి కథల్ని అలాగే పక్కన పెట్టేశారు. ఇలాంటి సమయంలో సూర్య తన తమ్ముడిని హీరోగా పెట్టి ఒక స్వచ్ఛమైన సినిమాను నిర్మించాడు. పల్లెటూళ్లలో పరిస్థితులు.. అక్కడి మనుషుల మనస్తత్వాల్ని చక్కగా అర్థం చేసుకున్న పాండిరాజ్.. తనకు తెలిసిన కథనే సినిమాగా తీసినట్లున్నాడు. రైతును హీరోగా పెట్టి సినిమా తీయడమే గొప్ప సాహసం. రైతు గొప్పదనాన్ని.. వ్యవసాయం ప్రాధాన్యాన్ని సినిమాలో బాగా చూపించారు. ఒక రైతు తాను ఎంతో ప్రేమించే రెండు ఎద్దులు చనిపోయినపుడు ఎంతగా విలవిలలాడిపోతాడో.. మనుషుల్ని కోల్పోయినట్లే ఎలా కుంగిపోతాడో సినిమాలో చూపించాడు పాండిరాజ్. పట్నం మనుషులకు ఇదంతా కొత్తగా అనిపిస్తుందేమో కానీ.. పల్లెటూరి మూలాలున్న వాళ్లు మాత్రం ఈ సన్నివేశానికి బాగా కనెక్టవుతారు. సినిమాలో ఇలాంటి మరికొన్ని హృద్యమైన సన్నివేశాలున్నాయి.
ఐతే హుషారుగా సాగిపోయే హీరో పాత్ర చుట్టూ అల్లుకున్న సన్నివేశాలతో ప్రథమార్ధంలో ఆహ్లాదం పంచే ‘చినబాబు’.. ద్వితీయార్ధంలో పూర్తిగా సెంటిమెంటు బాటలోకి వెళ్లిపోతుంది. ఉమ్మడి కుటుంబంలో చిన్న చిన్న అపార్థాలే ఎంత పెద్ద గొడవలకు దారి తీస్తాయో చూపించే సన్నివేశాల్లో మెలోడ్రామా మరీ ఎక్కువైపోయింది. ఐదుగురు అక్కల ముద్దుల తమ్ముడైన హీరో.. తన మేనకోడళ్లలో ఒకరిని కాకుండా బయటి అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడటం గొడవకు దారి తీస్తుంది. ఐదుగురు అక్కలు.. వాళ్ల కుటుంబాలు వచ్చి హీరో ఇంట్లో పంచాయితీలు చేయడం.. ఆస్తి పంపకాల దగ్గర గొడవ.. ఏడుపులు పెడబొబ్బలు.. అలకలు.. కొట్లాటలు.. ఇలా ఒక దశ దాటాక మెలోడ్రామా.. సెంటిమెంటు డోస్ బాగా ఎక్కువైపోయి మెజారిటీ ప్రేక్షకులు రుచించలేని విధంగా తయారవుతుంది ‘చినబాబు’. ప్రిక్లైమాక్స్ దగ్గర కొంచెం పుంజుకున్నప్పటికీ చివరికి ‘చినబాబు’పై ఇంప్రెషన్ ఏమంత గొప్పగా ఉండదు. ఓవరాల్ గా చెప్పాలంటే తమిళ నేటివిటీ బాగా దట్టించిన ఈ విలేజ్ డ్రామా.. ఫ్యామిలీ ఎమోషన్లు.. సెంటిమెంట్లను ఇష్టపడేవాళ్లకు ఓకే అనిపిస్తుంది. మిగతా వాళ్లకు ఇదంతగా రుచించకపోవచ్చు.
నటీనటులు:
‘చినబాబు’కు కార్తి నటన పెద్ద బలం. తన కెరీర్లో ఇప్పటిదాకా పోషించని విభిన్నమైన పాత్రలో కార్తి సులువగా ఒదిగిపోయాడు. రైతుగా చక్కగా నటించాడు. ఎమోషనల్ సీన్లలో కార్తి అదరగొట్టేశాడు. ‘అఖిల్’ భామ సాయేషా పల్లెటూరి అమ్మాయిగా చాలా కొత్తగా అనిపిస్తుంది. ఆమె నటన ఓకే. సత్యరాజ్ చాలా హుందాగా నటించి మెప్పించారు. కానీ ఆయనకు ఎస్పీ బాలు వాయిస్ సూటవ్వలేదు. ఇందులో విలన్ పాత్రను తెలుగు నటుడైన శత్రు పోషించడం విశేషం. అతను బాగానే చేశాడు.. ఆ పాత్రేమీ అంత ప్రత్యేకంగా అనిపించదు. భానుప్రియ.. ప్రియ భవానీ శంకర్.. మిగతా నటీనటులందరూ బాగానే చేశారు. సూరి కామెడీ పంచులతో అలరించాడు.
సాంకేతికవర్గం:
డి.ఇమాన్ పాటలన్నింట్లోనూ తమిళ వాసనలు గుప్పుమంటాయి. ఒకట్రెండు పాటలు వినసొంపుగా ఉన్నాయి. తెలుగు సాహిత్యం విషయంలో జాగ్రత్త పడాల్సింది. చాలా మొక్కుబడిగా పని కానిచ్చినట్లున్నారు. నేపథ్య సంగీతం సినిమాకు తగ్గట్లుగా ఉంది. వేల్ రాజ్ ఛాయాగ్రహణం బాగుంది. పల్లెటూరి నేపథ్యాన్ని చక్కగా చూపించాడు. నిర్మాణ విలువలు బాగున్నాయి. దర్శకుడు పాండిరాజ్.. తమిళ ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగా ఒక పల్లెటూరి కథను చెప్పే ప్రయత్నం చేశాడు. బహుశా అతనూ పల్లెటూరి నుంచే వచ్చాడేమో.. అక్కడి పరిస్థితుల్ని చాలా వాస్తవికంగా చూపించాడు. ఐతే రైతు కథను ఒక కాజ్ చుట్టూనో.. పెద్ద ప్రయోజనంతో ముడిపెట్టో తీసి ఉంటే ఎక్కువమందికి కనెక్టయ్యేది. కానీ ఒక కుటుంబం పరిధిలోనే సమస్యలు సృష్టించి.. ఒక డ్రామాలా తయారు చేయడంతో దీని పరిధి బాగా తగ్గిపోయింది.
చివరగా: చినబాబు.. సెంటిమెంట్ ఓవర్ లోడెడ్
రేటింగ్: 2.25/5
Disclaimer : This Review is An Opinion of One Person. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in Theatre