కోలీవుడ్ లో డబ్బింగ్ ఆర్టిస్ట్ యూనియన్ కు ఎన్నికల నేపథ్యంలో అధ్యక్షుడు రాధా రవికి పోటీగా గాయని చిన్మయి శ్రీపాద నామినేషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఈసారి ఎన్నికలు రసవత్తరంగా సాగడం ఖాయమని కోలీవుడ్ లో కథనాలు వెడెక్కించాయి. యూనియన్ నుంచి చిన్మయిని నిషేధించడం..అటుపై నిషేధం పూర్తవ్వడంతో రాధారవిని ఎలాగైనా గద్దె దించాలని చిన్మయి పెద్దాయనతో పోటీకి సై అనడంతో అది కాస్తా హాట్ టాపిక్ గా మారింది. ఈ నెల 15న ఎన్నికలకు సర్వం సిద్దం చేస్తున్న వేళ చిన్మయికి పెద్ద ఎదురు దెబ్బ తగిలింది.
చిన్మయి నామినేషన్ ను ఎన్నికల అధికారి తిరస్కరించారు. సంఘం నిబంధనలు ప్రకారం చిన్మయి నామిషన్ ను తిరస్కరించినట్లు వివరణ ఇచ్చారు. అనంతరం రాధారవిని ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించారు. దీంతో రాధారవి అనుచర వర్గం సంబురాల్లో మునిగిపోయింది. టపాసులు..బాణా సంచాలు కాల్చి ప్రాంగణాన్ని మోతెక్కించారు. అనంతరం మిఠాయిలు పంచి సంతోషాన్ని మీడియాతో పంచుకున్నారు. అయితే రాధారవి ఎన్నికపైనా... తన నామినేషన్ తిరస్కరణ పైనా.. చిన్మయి న్యాయ పోరాటానికి దిగుతుంది.
తన నామినేషన్ ను ఏ నిబంధన ప్రకారం తిరస్కరించారో? వివరణ ఇవ్వాలని ఆ సంగతేంటో న్యాయ స్థానంలో తేల్చుకుంటానని చిన్మయి ఆగ్రహం వ్యక్తం చేసింది. మీటూ ఉద్యమంలో భాగంగా రాధారవి-చిన్మయి మధ్య విబేధాలు తలెత్తి తారా స్థాయికి చేరుకున్న సంగతి తెలిసిందే. అనంతరం ఒకరిపై ఒకరు వ్యక్తిగత దూషణలకు సైతం దిగారు. రాధారవి కక్షగట్టే పరిశ్రమలో తన ఎదుగుదలను అట్టుకుంటున్నారని చిన్మయి సంచలన ఆరోపణలు చేసారు. తాజా సన్నివేశం నేపథ్యంలో చిన్మయి ఎన్నికల్లో పోటీ చేయకుండా పెద్దాయన వర్గం కుయుక్తులు పన్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.