తిట్ల‌కు చీవాట్లు గిఫ్ట్! చిన్మ‌యి రివ‌ర్స్ కోటింగ్!!

Update: 2019-07-08 04:05 GMT
`అర్జున్‌ రెడ్డి`తో తెలుగు తెర‌కు కొత్తద‌నాన్ని ప‌రిచ‌యం చేసిన ట్యాలెంటెడ్ డైరెక్ట‌ర్ సందీప్ వంగ బాలీవుడ్ లోనూ భారీ స‌క్సెస్ అందుకున్నాడు. హిందీలో `క‌బీర్‌ సింగ్‌` దాదాపు 225కోట్ల వ‌సూళ్ల‌తో సంచ‌ల‌నాలు సృష్టించింది. ఇటీవ‌ల ఈ చిత్ర ప్ర‌మోష‌న్ కోసం సందీప్ రెడ్డి చేసిన వ్యాఖ్య‌లు వివాదానికి తెర‌లేపాయి. ప్రేమించుకునే అమ్మాయి అబ్బాయి మ‌ధ్య ఒక‌రిపై ఒక‌రు చేయి చేసుకునేంత చొర‌వ వుండాలి. అదే ప్రేమంటే అన్న వ్యాఖ్య‌ను చేశాడు. ఈ మాట‌ల్ని స‌మంత‌ - గాయ‌ని కం డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మ‌యి శ్రీ‌పాద వ్య‌తిరేకించారు. మీటూ ఉద్య‌మంతో త‌మిళ చిత్ర ప‌రిశ్ర‌మ‌లో ప్ర‌కంప‌న‌లు సృష్టించిన చిన్మ‌యి తాజాగా సందీప్ వంగ‌పై చేసిన వ్యాఖ్య‌ల‌కు నెటిజ‌న్స్ మండిప‌డుతున్నారు.

``నువ్వు ఫెమినిస్టువి.. నీలాంటి దాన్ని రాహుల్ ఎలా భ‌రిస్తున్నాడో`` అంటూ ట్రోల్ చేస్తున్నారు. హ‌ద్దులు దాటి బూతులు తిట్ట‌డం వేడెక్కిస్తోంది. దీనిపై చిన్మ‌యి ఓ వీడియో సందేశాన్ని పోస్ట్ చేయ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. `నేను నా టైమ్ లైన్‌ పై ట్వీట్ చేస్తే చాలా గోల‌ చేస్తున్నారు. ఓ పాపుల‌ర్ వ్య‌క్తి ఇంట‌ర్య్వూలో అన్న మాట‌ల‌కు స్పందించ‌డం అన్న‌ది నా దృష్టిలో చాలా చిన్న విష‌యం. దీనికి సోష‌ల్ మీడియాలో న‌న్ను విప‌రీతంగా ట్రోల్ చేయ‌డం స‌రైన‌దేనా? నీ భ‌ర్త ఇంకా నీకు విడాకులు ఇవ్వ‌లేదా?  నీ భ‌ర్త చ‌చ్చిపోలేదా? ఇంకా నువ్వు బ్ర‌తికే వున్నావా? అంటూ బూతులు తిడుతున్నారు. ఇదేదో థ‌ర్డ్ వ‌ర‌ల్డ్ వార్‌ లా ఫీలైపోతున్నారు.. అదే నాకు అర్థం కావ‌డం లేదు.

సినిమాలో చెప్పిన ఓ విష‌యాన్ని జ‌న‌ర‌లైజ్ చేసి దాన్ని అంద‌రికి ఆపాదిస్తున్నారు!! అదే త‌ప్పని చెబుతున్నాను. మ‌న ఇండియాలో పిల్ల‌ల‌నే కొట్టొద్ద‌ని టీచ‌ర్లకు చ‌ట్టాలొచ్చాయి. ఇలాంటి స‌మ‌యంలో ఒక‌రిని ఒక‌రు కొట్టుకుంటేనే  వాళ్ల‌ల్లో ప్రేమ వుంటుంద‌నేది క‌రెక్టు కాదు. దాన్ని నేను ఒప్పుకోను. ప్ర‌తీ ఒక్క‌రికీ ఓ జీవితం వుంటుంది. త‌మ అభిప్రాయాలు చెప్పే స్వేచ్ఛ వుంటుంది. నేనేదో అంటున్నాన‌ని, నేను ఫెమినిస్టున‌ని అనుకున్నా నేను ఫీల‌వ‌ను. న‌న్ను ఎంత‌గా ట్రోల్ చేసినా.. బూతులు తిట్టినా నాకు ఒరిగేది ఏమీ లేదు. రాహుల్ న‌న్ను ఎలా భ‌రిస్తున్నాడో అని అత‌నిపై సానుభూతిని వ్య‌క్తం చేసినా నోప్రాబ్లం. అంటూ త‌న‌ని ట్రోల్ చేస్తున్న వాళ్ల‌కి చిన్మియి గ‌ట్టి కౌంట‌రిచ్చింది. ఇండియాలో ఆడా మగా అనే తేడా లేకుండా బూతు బారిన ప‌డుతున్నారు. ఇబ్బందులు ఎదుర‌వుతున్నాయి. అయితే మీరు న‌న్ను అన్నంత మాత్రాన దానిని ప‌ట్టించుకోను. ఇవ‌న్నీ జీవితంలో ఒక భాగం మాత్ర‌మేన‌ని భావిస్తాను.. అంటూ చిన్మ‌యి త‌న‌దైన శైలిలో క‌న్ క్లూజ‌న్ ఇచ్చారు. నెటిజ‌నుల్ని అన‌వ‌స‌రంగా ఎమోష‌న్ అవ్వొద్ద‌ని సూచించ‌డం ఆస‌క్తిక‌రం.

   

Tags:    

Similar News