సోషల్ మీడియాలో రెగ్యులర్ గా చిన్మయి అమ్మాయిలపై జరగుతున్న అఘాయిత్యాల గురించి.. ఆడవారు ఎదుర్కొంటున్న అన్యాయాల గురించి గళం విప్పుతూ వస్తోంది. తాజాగా మరోసారి చిన్మయి సోషల్ మీడియా ద్వారా ఒక అమ్మాయికి బాసటగా నిలిచింది. దేశ వ్యాప్తంగా మీటూ సమయంలో గుర్తింపు దక్కించుకున్న చిన్మయి కి చాలా మంది అమ్మాయిలు ఆపద సమయంలో సహాయం కోరుతూ మెసేజ్ లు చేస్తున్నారు.. కొందరు సలహాలు అడుగుతూ ఉంటే మరి కొందరు తమపై జరిగిన జరుగుతున్న లైంగిక దాడుల గురించి చెబుతున్నారు. ఇటీవల ఒక యువతి తన విషయంలో జరిగిన ఒక సంఘటనను చిన్మయి ముందుకు తీసుకు వచ్చింది. ఆ విషయాన్ని చిన్మయి సోషల్ మీడియా ద్వారా బయటి ప్రపంచంకు తెలియజేసింది.
ఆ అమ్మాయి చిన్మయికి సోషల్ మీడియా ద్వారా.. హాయ్ అక్క. నాకు ఇటీవలే పెళ్లి కుదిరింది. వారు కట్నంగా డబ్బులు అడిగారు. నాకు సోదరులు లేరు. ఒక చెల్లి మాత్రమే ఉంది. నా తల్లిదండ్రులు వారు అడిగిన మొత్తంను ఇచ్చేందుకు ఓకే చెప్పారు. అందుకోసం కొంత ఆస్తిని నా తండ్రి అమ్మేందుకు సిద్దం అయ్యాడు. ఆస్తి ఇస్తానన్నా కూడా వద్దని వారు కేవలం డబ్బు మాత్రమే కావాలని డిమాండ్ చేశారు. దాంతో ఆస్తి అమ్మాల్సి వచ్చింది. సరే అని పెళ్లికి సిద్దం అయ్యాను. ఆ అబ్బాయికి నేను వర్క్ చేస్తున్నాను కదా రెండేళ్ల పాటు నేను నా జీతంను నా తల్లిదండ్రులకు ఇవ్వాలనుకుంటున్నట్లుగా చెప్పాను. అప్పుడు అతడు ఒప్పుకోలేదు. పెళ్లి చేసుకున్న తర్వాత నీ జీతం పై సర్వ హక్కులు నావే... ఎలా నీ కుటుంబ సభ్యులకు ఇస్తావంటూ అతడు అడ్డుకున్నాడు. నీకు అబ్బాయివి కనుక నీ తల్లిదండ్రులకు నీ జీతం ఇస్తున్నావు.. కాని నా జీతం నా తల్లిదండ్రులకు ఎందుకు ఇవ్వద్దు అంటూ నేను ప్రశ్నించాను. ఆ విషయంలో పెద్ద గొడవ జరిగిందని మెసేజ్ లో పేర్కొంది.
అందుకు చిన్మయి సమాధానంగా చాలా ధీటుగానే రిప్లై ఇచ్చింది. పెళ్లి చేసుకున్నంత మాత్రాన నీ తల్లిదండ్రులు వారి ఆస్తిని కాని డబ్బును కాని ఇవ్వాల్సిన అవసరం లేదు. డబ్బు ఇవ్వకుంటే పెళ్లి చేసుకోవాలి. ఇక పెళ్లి చేసుకున్న తర్వాత ఎవరి డబ్బులు వారివే. నీ డబ్బులపై నీకు పూర్తి అర్హత హక్కు ఉంటుంది. నీ డబ్బుపై.. నీపై పెళ్లి అయిన వెంటనే ఎందుకు వారి పెత్తనం ఉంటుందని చిన్మయి ప్రశ్నించింది. నీవు నీ స్వయం ప్రతిపత్తిని కోల్పోయి ఆ పెళ్లి చేసుకోవాల్సిన అవసరం లేదు అంటూ ఈ సందర్బంగా చిన్మయి ఆ అమ్మాయికి సలహా ఇచ్చింది. అమ్మాయిలు వారి తల్లిదండ్రులకు పెళ్లి తర్వాత ఆర్థిక తోడ్పాటును ఇవ్వాలనుకోవడం మంచి నిర్ణయం. దాన్ని భర్తలు అడ్డుకునే అర్హత లేదు అంటూ చిన్మయి పేర్కొంది.