రైటర్ చిన్నికృష్ణ కెరీర్ భలేగా ఉంటుంది. కెరీర్ లో అన్నీ పెద్ద సినిమాలకే రాసినా.. భారీ హిట్స్ ఉన్నా.. ఛాన్సులు మాత్రం తక్కువగానే ఉంటాయి. రీసెంట్ గా తన 150వ సినిమాకి స్టోరీ రాయమని చిరంజీవి చెప్పారనడంతో బాగా వార్తల్లో నానిన ఈ రైటర్.. ఇప్పుడు ఓ ఇంటర్వ్యూ ఇచ్చాడు. అందులో జనాలపై తన అభిప్రాయం చెప్పిన తీరు ఆశ్చర్యం కలిగిస్తోంది.
మీడియా నెగిటివ్ అంటేనే ఇష్టపడుతుందని.. పాజిటివ్ అంశాలను పెద్దగా పట్టించుకోరని అంటున్నాడు చిన్ని కృష్ణ. ముఖ్యంగా తనపై వచ్చే నెగిటివ్ కామెంట్స్ విషయంలో ఆయన స్పందించిన తీరు ఆశ్చర్యం కలిగించేదే. ' ప్రచారం నెగిటివ్ గా ఉంటేనే బాగుంటుంది. చిన్ని కృష్ణ రెండొందల మందికి అన్నదానం చేశాడు అంటే దాని గురించి ఎవరూ రాయరు.. చూపించరు కూడా. కానీ చిన్ని కృష్ణ ఓ అమ్మాయిని రేప్ చేయబోయాడు.. ఆ అమ్మాయి తప్పించుకుంది. సీసీ కెమేరాలో దొరికాడు అంటే రేటింగ్ అద్భుతంగా ఉంటుంది. మీడియాలో పాజిటివ్ ఎనర్జీ కంటే నెగిటివ్ ఎనర్జీ ఈజ్ చాలా పవర్ ఫుల్' అన్నాడు ఈ రైటర్.
మీడియా వాళ్లని అడిగితే.. జనాలు చూసేదే చూపిస్తున్నాం.. అవే రేటింగ్స్ వస్తాయ్ అంటారు. ఈ లెక్కన జనాలు ఇలాంటివే చూడాలని కోరుకుంటున్నారని ఈ చిన్ని కృష్ణ చెబుతున్నట్లుగా ఉంది. మీడియాకి ఇంటర్వ్యూ ఇస్తూ.. ఇలా మీడియాపైనే సెటైర్లు వేయడం చిన్ని కృష్ణకే చెల్లింది కదూ.