సైరా కు సై అన్నారు కాని!

Update: 2018-03-01 13:07 GMT
మెగాస్టార్ చిరంజీవి 151 సినిమా సైరా నరసింహరెడ్డి ఫస్ట్ షెడ్యూల్ జనవరిలోనే పూర్తి చేసినా రెండో షెడ్యూల్ గురించి ఇప్పటి దాకా ఎటువంటి అప్ డేట్ లేదు. దానికి ప్రధాన కారణం తీసుకున్న స్టార్ కాస్ట్ మొత్తం వివిధ బాషలకు చెందినా వాళ్ళు కావడం, కాల్ షీట్స్ పరంగా క్లాష్ ఉండటం లాంటి కారణాల వల్ల ఎప్పుడు మొదలు పెట్టాలి అనే దాని గురించి ఎటువంటి నిర్ణయం తీసుకోలేకపోతున్నారు. కాని ఈ వారంలో మాత్రం ఫస్ట్ షెడ్యూల్ లో బాలన్స్ ఉన్న కొన్ని సీన్స్ తో పాటు రషెస్ చూసాక యూనిట్ కి సంతృప్తి అనిపించనివి కూడా రీ షూట్ చేయబోతున్నారని టాక్. ఇలా చేయాలనే నిర్ణయం మాత్రం చిరంజీవిదేనట. రాజీ అనే పదమే ఉత్పన్నం కాకుండా తనకు రిస్క్ అవుతున్నా మళ్ళి మళ్ళి గెటప్ మార్చేందుకు చిరు సిద్ధపడడానికి కారణం ఇదే అంటున్నారు.

ఇక 5 నుంచి 7 తేది దాకా అప్రతిహతంగా సైరాలోని యాక్షన్ సీన్స్ పీటర్ హైన్స్ నేతృత్వంలో షూట్ చేయనున్నారని టాక్. అప్పటికంతా కెమెరామెన్ రత్నవేలు కూడా అందుబాటులో ఉంటాడు కనక ఈ టైం సెట్ చేసుకున్నారు. దీని తర్వాత సెకండ్ షెడ్యూల్ ఎప్పుడు మొదలు పెట్టేది క్లారిటీ రావడం లేదు. ఇలా కేవలం చిరు, సపోర్టింగ్ కాస్ట్ తో ఎక్కువ కాలం షూటింగ్ కొనసాగించలేరు. హీరొయిన్ నయనతార కాంబో సీన్స్ కీలకంగా ఉన్నాయట. వాటిని తీయాలంటే తను రావాలి. రెండో వారంలోపు పూర్తి క్లారిటీతో డేట్స్ ఇస్తానని నయనతార చెప్పడం వల్లే కొద్దిగా ఆలస్యం జరుగుతున్నట్టు టాక్. అమితాబ్ విషయంలో మాత్రం ప్లానింగ్ తోనే ఉన్నాడు సూరి .

ఇక విజయ్ సేతుపతి - కిచ్చ సుదీప్ లు ఎప్పుడు పాల్గొనేది కూడా తెలియాల్సి ఉంది. వీళ్ళ పాత్రల పరిధి ఎంత ఉంది అనే దాన్ని బట్టి డేట్స్ అవసరం పడతాయి. ఇప్పుడు చేస్తున్న షూట్ అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతుంది. సైరా మొదలు పెట్టిన టైం ఏమో కాని ఆటంకాలకు మాత్రం అడ్డుకట్ట పడటం లేదు. అన్నట్టు ఇంకా సైరా మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు అన్నది నిర్ణయం తీసుకోలేదు.
Tags:    

Similar News