ఇద్దరు సీనియర్ హీరోలు వచ్చే ఏడాది సంక్రాంతి రేసులో పోటీపడనున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. వివరాల్లోకి వెళితే.. మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ వచ్చే సంక్రాంతికి సై అంటే సై అంటూ పోటీకి దిగబోతున్నట్టుగా తెలుస్తోంది.
మెగాస్టార్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ మూడు సినిమాల్లో నటిస్తూ బిజీగా వున్నారు. ఇందులో ఆయన నటిస్తున్న క్రేజీ మూవీ `వాల్తేరు వీరయ్య` ( టైటిల్ ఇంకా కన్ఫమ్ కాలేదు). బాబీ దర్శకత్వం వహిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై భారీ స్థాయిలో ఈ మూవీని నిర్మిస్తున్నారు.
ఇందులో మాస్ మహారాజా రవితేజ కీలక పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలే సెట్ లోకి ఎంట్రీ ఇచ్చారు కూడా. వీరిద్దరి కలయికలో ప్రస్తుతం దర్శకుడు బాబీ పలు కీలక ఘట్టాలని చిత్రీకరిస్తున్నారు. రవితేజ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్న ఈ మూవీలో చిరు, రవితేజ సవతి సోదరులుగా కనిపించనున్నారంటూ వార్తుల వినిపిస్తున్నాయి. చిరుకు జోడీగా శృతిహాసన్ నటిస్తున్న ఈ మూవీలో రవితేజకు జోడీగా కేథరిన్ కనిపించనుంది.
ఈ మూవీని వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయబోతున్నట్టు చిత్ర బృందం ఇప్పటికే ప్రకటించింది. అయితే ఇదే రోజున సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ నటిస్తున్న107వ సినిమా కూడా రానుందంటూ తాజాగా వార్తలు వినిపిస్తున్నాయి. `క్రాక్`తో ట్రాక్ లోకి వచ్చిన గోపీచంద్ మలినేని ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ అత్యంత భారీ స్థాయిలో ఈ మూవీని నిర్మిస్తోంది. బాలయ్యకు జోడీగా శృతిహాసన్ నటిస్తున్న ఈ మూవీ షూటింగ్ గత కొన్ని రోజులుగా కర్నూల్ లో జరుగుతోంది.
కర్నూల్ కొండారెడ్డి బురుజు సమీపంలో పలు కీలక ఘట్టాలని చిత్రీకరిస్తున్నారు. ఈ సన్నివేశాల్లో బలయ్య యంగ్ గా కనిపిస్తున్నాడు. డిసెంబర్ 2న విడుదలైన `అఖండ` సంచలన విజయాన్ని సొంతం చేసుకోవడంతో ఇదే డేట్ న ఈ మూవీని కూడా విడుదల చేయాలని ప్లాన్ చేశారని తెలిసింది. అయితే తాజాగా ఈ మూవీని సంక్రాంతి బరిలో దించబోతున్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇది కుదిరే పని కాదని తెలుస్తోంది.
కారణం బాలయ్య సినిమాని మైత్రీ వారు నిర్మిస్తున్నారు. చిరంజీవి `వాల్తేరు వీరయ్య`కు వీళ్లే ప్రొడ్యూసర్స్. అలాంటప్పుడు తాము నిర్మిస్తున్న రెండు భారీ చిత్రాలని ఓకేసారి సంక్రాంతి బరిలోకి దింపేస్తారన్నది అపోహ మాత్రమే. ఒకే నిర్మాణ సంస్థ తమ చిత్రాలనే పోటా పోటీగా విడుదల చేయదు. ఈ లాజిక్ ని బట్టి బాలయ్య, చిరంజీవిల సినిమాలు సంక్రాంతికి పోటీపడే ప్రసక్తే లేదని స్పష్టమవుతోంది. సో సంక్రాంతికి సీనియర్ హీరోల పోటీ అన్నది ఒట్టి రూమరే.