మెగా కాంపౌండ్ నుంచి వస్తున్న మరో హీరో కళ్యాణ్ దేవ్ హీరోగా నటించిన విజేత ఆడియో ఫంక్షన్ ఈ రోజు సాయంత్రం జరగనున్న సంగతి తెలిసిందే. దీనికి చిరంజీవి అతిధిగా రావడం పెద్ద విశేషం కాదు. స్వయానా చిన్నల్లుడు అందులోనూ అతని మొదటి సినిమా కాబట్టి గెస్ట్ గా రావడమే న్యాయం. కాకపోతే బాలకృష్ణ కూడా గెస్ట్ గా లిస్ట్ లో ఉన్నారని నిన్న మొన్న కొన్ని కథనాలు వచ్చాయి. విజేత నిర్మాత సాయి కొర్రపాటి బాలయ్యకు అత్యంత సన్నిహితుడు కావడమే కాక ఎన్టీఆర్ బయోపిక్ లో నిర్మాణ భాగస్వామి కాబట్టి పిలిచే ఉంటారనే అంచనాలో అలా అనుకున్నారు.
కానీ తాజా సమాచారం మేరకు ఆయన రావడం లేదట. కారణాలు తెలియలేదు కానీ బయటి ఆడియో వేడుకలకు బాలయ్య అతిధిగా రావడం చాలా చాలా అరుదు. ఎవరో దాకా ఎందుకు ఆయన ఫ్యామిలీ హీరోల వేడుకలకే ఎప్పుడో కానీ రారు. అందుకే విజేతకు సైతం అదే కారణం చూపి సున్నితంగా తిరస్కరించినట్టు తెలిసింది. సో స్టేజి మీద చిరంజీవినే ప్రధాన ఆకర్షణగా నిలవబోతున్నారు.
రాకేష్ శశి దర్శకత్వంలో రూపొందిన విజేతను ఫక్తు ఫామిలీ డ్రామాగా తీర్చిదిద్దినట్టు తెలిసింది. టీజర్ లో కూడా అదే రివీల్ చేసారు. చికెన్ మీద పాటను మొదటి ట్రాక్ గా ఇటీవలే విడుదల చేసిన యూనిట్ ఈ రోజు అన్ని పాటలను రిలీజ్ చేయబోతున్నారు. వారాహి బ్యానర్ పై సాయి కొర్రపాటి నిర్మించిన ఈ మూవీపై అంచానాలు మరీ భారీగా లేవు కానీ చిరు చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్ స్క్రీన్ మీద ఎలా కనిపిస్తాడా అనే ఆసక్తి అయితే నెలకొని ఉంది. పైగా పోస్టర్స్ తో పాటు టీజర్ లో హీరో మెటీరియల్ ఉన్నవాడిలా అనిపించడంతో కంటెంట్ ఉంటే కనక విజేత బాక్స్ ఆఫీస్ దగ్గర విజేత గా నిలిచే ఛాన్స్ ఉంది.
అసలే చిరంజీవి ఎవర్ గ్రీన్ హిట్ మూవీ టైటిల్ ని పెట్టుకున్నారు. ఆ రకంగా కూడా మెగా ఫాన్స్ దీనికి కనెక్ట్ అవుతున్నారు. పవన్ కళ్యాణ్ తొలిప్రేమ టైటిల్ ను వాడుకుని వరుణ్ తేజ్ హిట్ కొట్టినట్టు చిరు విజేత టైటిల్ తో కళ్యాణ్ దేవ్ కూడా హిట్ కొట్టాలని వారి కోరిక. అయినా మొదటి సినిమాకే ఇన్నేసి అంచనాలు మోయటం కష్టమే కానీ విడుదల అయ్యాక మెప్పిస్తే కనక అవకాశాలకు లోటు ఉండదు.