చిరంజీవి క‌థ‌ని బ‌య‌ట పెట్టేసిన‌ట్టేగా..!

Update: 2015-08-25 20:19 GMT
మేన‌ల్లుడు సాయిధ‌ర‌మ్ తేజ్ క‌థానాయ‌కుడిగా న‌టించిన `సుబ్ర‌మ‌ణ్యం ఫ‌ర్ సేల్‌` సినిమా పాట‌ల విడుద‌ల కార్య‌క్ర‌మానికి చిరంజీవి ముఖ్య అతిథిగా హాజ‌రైన విష‌యం తెలిసిందే. మాట‌ల మ‌ధ్య‌లో ఆయ‌న `ఈ సినిమా క‌థ నాకు బాగా తెలుసనీ... నేను చేసిన మొగుడు కావాలి, బావ‌గారూ బాగున్నారా సినిమాలు గుర్తుకొచ్చాయ‌ని చెప్పుకొచ్చారు. ఆయ‌న మాట‌ల్ని బ‌ట్టి, ట్రైల‌ర్‌ ని బ‌ట్టి సినిమా క‌థేంటో ఊహిస్తున్నారంతా.  అమెరికా వ‌చ్చింది ఫేస్‌ బుక్కులో ఫొటోలో పెట్ట‌డానికో, ఫొటోలు దిగ‌డానికో కాదు... ప్ర‌తీ క్ష‌ణాన్నీ డ‌బ్బుగా మార్చుకోవాలి... అంటూ హీరో సాయిధ‌ర‌మ్ తేజ్  డైలాగ్ చెబుతూ ట్రైల‌ర్ లో క‌నిపిస్తాడు. అంటే ఫారిన్ లో డ‌బ్బు వేట‌లో ఉన్న హీరో.. ఆ త‌ర్వాత ఇండియాకి వ‌స్తాడు, అమ్మాయి స‌మ‌స్య‌ల్ని త‌న‌విగా భావించి రంగంలోకి దిగుతాడ‌న్న విష‌యం చూచాయ‌గా అర్థ‌మ‌వుతోంది.

'బావ‌గారు బాగున్నారా' స్టోరీ కాన్సెప్టు కూడా ఇంచుమించు అంతే. చిరు త‌న మాట‌ల్లో `మొగుడు కావాలి` సినిమా ప్ర‌స్తావ‌న కూడా తీసుకొచ్చాడు కాబ‌ట్టి అందులోని  ఓ ఎలిమెంట్ కూడా ఇందులో ఉండొచ్చ‌ని ఊహిస్తున్నారు. అంద‌రికీ తెలిసిన క‌థే అయినా త‌న‌దైన మార్క్ హీరోయిజంతో పాటు, కొన్ని ఇంట్రెస్టింగ్ ట్విస్టులు జోడించి దిల్‌రాజు మార్క్ ఫ్యామిలీ అట్మాస్ఫియ‌ర్‌ ని చూపిస్తూ సినిమాని మ‌లిచార‌ని అర్థ‌మ‌వుతోంది. ట్రైల‌ర్ లో కూడా హీరోయిజం, కామెడీ, సెంటిమెంట్‌, రొమాన్స్ అన్నీ క‌నిపిస్తున్నాయి. సో... ఈసారి హ‌రీష్‌శంక‌ర్ ఎవ్వ‌రికీ ఏ విష‌యంలోనూ లోటు రాకుండా సినిమా తీశాడ‌ని అర్థ‌మ‌వుతోంది.  చిరు క‌థ‌ని చూచాయ‌గా బ‌య‌ట పెట్ట‌డం మంచిదే అయ్యింద‌ని చిత్ర‌బృందం భావిస్తోంద‌ట‌. నా సినిమాల త‌ర‌హాలో ఉంటుంద‌ని చిరంజీవి లాంటి అగ్ర‌హీరో చెప్ప‌డం ప్ల‌స్సే అని భావిస్తున్నారు.
Tags:    

Similar News