అల్లుడి సినిమా కోసం చిరు సూచనలు

Update: 2017-12-18 17:07 GMT
గత కొంత కాలంగా మెగా ఫ్యామిలీ నుంచి మరో హీరో రాబోతున్నాడు అనే వార్త తెగ హల్ చల్ చేస్తోన్న సంగతి తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి చిన్నల్లుడు కళ్యాణ్ కానుగంటి వెండితెర ఎంట్రీకి అంతా సిద్దమయ్యింది. ఇక సినిమా పట్టాలెక్కడమే తరువాయి. అయితే మొదట్లో బిజినెస్ వ్యవహారాలతో బిజీ అయిన కళ్యాణ్ చిరు అల్లుడవ్వగానే నటనపై ఆసక్తిని పెంచుకొని హీరోగా తనకంటూ ఒక మంచి గుర్తింపు తెచ్చుకోవాలని అనుకుంటున్నాడు.

వెంటనే సీనియర్ రచయిత సత్యానంద్ దగ్గర నటనపై శిక్షణను తీసుకొని మంచి కథను సొంతంగా సెలెక్ట్ చేసుకున్నాడు. రాకేష్ శశి అనే కొత్త దర్శకుడు చెప్పిన కథను వెంటనే చిరుకి చెప్పి ఫైనల్ చేయించాడు. ఇక నిర్మాతగా సాయి కొర్రపాటి గారు కూడా ఫిక్స్ అయ్యారు. అయితే ఇటీవల సాయి కొర్రపాటితో చిరంజీవి ఏకాంతంగా చాలా సేపు చర్చలు జరిపారట. అల్లుడి సినిమా కథను బట్టి సినిమా ఉండాలని సూచించారట. అంతే కాకుండా.. మెగాస్టార్ అల్లుడని ఎక్కువగా ప్రచారం చేయకుండా.. బడ్జెట్ కూడా ఎక్కువ పెద్దవద్దని కథకు తగినంత మాత్రమే పెట్టాలని సూచించారట. ఇక మెగా ఫ్యామిలీ నుంచి వస్తున్నట్టు కాకుండా ఒక కొత్త హీరో వస్తే ఎలా ఉంటుందో అలా ఉండాలని చిరు మరి మరి చెప్పారట. మెయిన్ గా కళ్యాణ్ నటన సినిమా అవుట్ ఫుట్ బావుండాలని పలు జాగ్రత్తలను కూడా చిరు తెలియజేశారని తెలుస్తోంది.

మరి మెగా అల్లుడి సినిమాను సాయి కొర్రపాటి ఏ స్థాయిలో తెరకెక్కిస్తారో చూడాలి. అయితే తను పక్కనే ఉండి కూడా.. కేవలం సొంత టాలెంటుతోనే పైకొచ్చేలా అల్లుడి కెరియర్ ను ప్లానింగ్ చేస్తున్నారంటే.. చిరు చాలా డిఫరెంట్ థింకర్ అంటూ ఆయన్ను చాలామంది పొగిడేస్తున్నారు.
Tags:    

Similar News