చిరు క‌న్ను... అజిత్ సినిమాపై?!

Update: 2015-11-18 17:30 GMT
తెలుగు ద‌ర్శ‌కుల‌పైన, ర‌చ‌యిత‌లపైన ఆశ‌లు వ‌దులుకున్న‌ట్టే క‌నిపిస్తున్నాడు చిరు. త‌న 150వ సినిమాకోసం రెండేళ్లుగా ఆయ‌న క‌థ‌లు వింటూనే ఉన్నారు. కానీ ఏదీ సెట్ట‌వ్వ‌లేదు. ఇక  రీమేక్ సినిమాలే శ‌ర‌ణ్యం అని గ‌ట్టిగా ఫిక్స‌యిపోయిన‌ట్టున్నారు. అందుకే దృష్టంతా త‌మిళ చిత్రాల‌పైనే పెట్టాడు. అక్క‌డ ఏ సినిమా విడుద‌లైనా దానిపై ఓ లుక్కేస్తున్నాడు. ఇటీవ‌ల విడుద‌లై ఘ‌న విజ‌యందిశ‌గా దూసుకెళుతున్న  అజిత్ సినిమా గురించి చిరు ఆస‌క్తిని క‌న‌బ‌రుస్తున్న‌ట్టు తాజా స‌మాచారం.

త‌మిళ చిత్రాల‌పై చిరు ఆస‌క్తిని గ‌మ‌నిస్తున్న అక్క‌డి నిర్మాత‌లు `మా సినిమా మీ శైలికి త‌గిన‌ట్టే ఉంది, కావాలంటే చూడండి` అంటూ క‌బురు పెడుతున్నార‌ట‌. ఇటీవ‌ల అజిత్‌ తో నిర్మించిన వేదాలం గురించి కూడా నిర్మాత ఎ.ఎమ్‌.ర‌త్నం చిరంజీవికి క‌బురు పెట్టిన‌ట్టు తెలిసింది. వేదాలం త‌మిళంలో భారీ వ‌సూళ్ల‌ను సొంతం చేసుకుంటోంది.  వంద కోట్ల క్ల‌బ్‌ లోకి వెళ్లనుంద‌ని ట్రేడ్ వ‌ర్గాలు చెబుతున్నాయి.  అందులోని క‌థ నిజంగానే చిరుకు త‌గ్గ‌ట్టుగానే ఉంటుంద‌ట‌. అందుకే వేదాలం సినిమాని త్వ‌ర‌లోనే వీక్షించాల‌ని చిరు ఫిక్స‌యిన‌ట్టు స‌మాచారం.  మ‌రి ఈ క‌థైనా ఓకే అవుతుందా లేక క‌త్తిలాగే మ‌రుగున ప‌డిపోతుందా అన్న‌ది చూడాలి. వేదాలం సినిమాని శివ తెర‌కెక్కించారు. అత‌ను ఇదివ‌ర‌కు తెలుగులో ర‌వితేజ‌తో ద‌రువు - గోపీచంద్‌ తో శౌర్యం - శంఖం సినిమాల్ని తెర‌కెక్కించాడు. 
Tags:    

Similar News