ఫ్యాన్స్ కోసం డ్యాన్స్ చేస్తానన్న మెగాస్టార్...!

Update: 2020-04-29 11:38 GMT
ప్రస్తుతం లాక్ డౌన్ వేళ ఇంటికే పరిమితమైన మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తూ.. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్నారు. ప్రస్తుత పరిస్థితులపై స్పందించడమే కాకుండా.. తన జ్ఞాపకాలను కూడా అభిమానులతో పంచుకుంటున్నారు. ఏప్రిల్ 29 అంటే 'అంత‌ర్జాతీయ డ్యాన్స్ దినోత్స‌వం'. ఈ సంద‌ర్భంగా మెగాస్టార్ చిరంజీవి త‌న‌కి డ్యాన్స్‌ కి త‌న‌కి ఉన్న ప్ర‌త్యేక‌మైన అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. తన సోషల్ మీడియా మాధ్యమం ట్విట్టర్ ద్వారా ఒక వీడియో పోస్ట్ చేసారు. డ్యాన్స్ తో తనకు ఉన్న అనుబంధం మీ అందరికీ తెలుసని.. అది మరువలేనిదని.. అదే తనకు కోట్లాది మంది అభిమానులు తెచ్చిపెట్టిందని మెగాస్టార్ అన్నారు. సంగీతం వలె డాన్స్ కూడా ధ్యానంలా ప‌ని చేస్తుందని.. ఎలాంటి మాన‌సిక స్థితిలో ఉన్నా కూడా డ్యాన్స్ మ‌నకి మంచి ఉప‌శ‌మ‌నం ఇస్తుందని.. ఒత్తిడిని త‌గ్గిస్తుంది. ఇలాంటి స‌మ‌యాల‌లో మ‌నమంద‌రం ఒత్తిడిని పోగొట్టుకునేందుకు డాన్స్ చేయాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంద‌ని చిరు ట్వీట్ చేసారు.

అలానే తనకు ఎప్పుడైనా పని ఎక్కువై మానసికంగా ఒత్తిడికి గురైన, డల్ గా ఉన్న సందర్భాల్లో మంచి మ్యూజిక్ పెట్టుకుని వింటూ డాన్స్ చేస్తూ ఉంటే ఎంతో ప్రశాంతంగా ఉంటుందని చెప్పారు. ప్రస్తుతం లాక్ డౌన్ నేపథ్యంలో ఇంట్లో ఉంటున్న మీరు కూడా ఎప్పుడైనా ఒత్తిడికి గురైతే ఈ విధంగానే చేయమని మెగాస్టార్ అభిమానులకు సూచిస్తూ అందరికీ ఇంటర్నేషనల్ డాన్స్ డే శుభాకాంక్షలు తెలిపారు. అంతేకాకుండా 'అంత‌ర్జాతీయ డ్యాన్స్ దినోత్స‌వం' సందర్భంగా తన సినిమాలకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన డాన్స్ క్లిప్పింగ్స్ తో కూడిన వీడియో ని సాయంత్రం 6 గంటలకు ట్విట్టర్ లో పోస్ట్ చేస్తానని.. మీరు కూడా మీ డాన్స్ వీడియోలను ఫ్రెండ్స్ కి షేర్ చేసుకోండని' మెగాస్టార్ చిరంజీవి వీడియో రూపంలో తెలియజేసారు.


వీడియో కోసం క్లిక్ చేయండి
Tags:    

Similar News