సుస్మిత.. మెగా అభిమానులకు పరిచయం చేయనక్కర్లేని పేరు. చిరంజీవి పెద్ద కుమార్తెగానే కాదు.. ఒక ప్రొఫెషనల్ స్టయిలిస్టుగా కూడా పేరు తెచ్చుకుంది. సినిమా కుటుంబంలో పుట్టి పెరిగినా ఫ్యాషన్ వైపు అడుగులు వేసింది. నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ చదువు పూర్తి చేసింది. ఎన్నో యాడ్ ఫిలిమ్స్ చేసి ఫ్యాషన్ స్టయిలింగ్ అండ్ ఫొటోగ్రఫీ పై పట్టు పెంచుకుంది. ఫ్యాషన్ పై ఆమెకున్న ఇంట్రస్ కు ఫ్యామిలీ సపోర్ట్ తో ఈజీగానే సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టింది. శంకర్ దాదా ఎంబిబిఎస్ సినిమాలో తండ్రి చిరంజీవి డ్రస్సులను తనే డిజైన్ చేసింది.
పెళ్లి చేసుకుని పిల్లలు పుట్టాక కుటుంబ బాధ్యతలతో చాలాకాలంపాటు ఇండస్ట్రీకి దూరంగా ఉన్న సుస్మిత చిరంజీవి కమ్ బ్యాక్ మూవీ ఖైదీ నెంబర్ 150తో తిరిగి ఫ్యాషన్ వరల్డ్ లో మళ్లీ అడుగు పెట్టింది. ఖైదీ నెంబర్ 150లో చిరంజీవి పాత్రకు తగినట్టు డ్రస్సుల్ని డిజైన్ చేసి శభాష్ అనిపించుకుంది. ఇప్పుడు తన సోదరుడు రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న రంగస్థలం సినిమాకూ తన కాస్ట్యూమ్స్ డిజైన్ చేసింది. ‘‘చరణ్ నేను అక్క తమ్ముళ్లమే కాదు. మేమిద్దరం మంచి ఫ్రెండ్స్. చాలా సరదాగా ఉంటాం. నేనేం చెప్పదల్చుకున్నానో ఇట్టే అర్ధం చేసుకోగలడు. అలాగే అతడి కంఫర్ట్ లెవెల్స్ నాకు బాగా తెలుసు. కాబట్టి తనతో పనిచేయడం ఈజీ’’ అంటోంది సుస్మిత.
పీరియాడికల్ మూవీగా వస్తున్న రంగస్థలం సినిమాకు పనిచేయడం ఓ కొత్త అనుభూతిని ఇస్తోందంటోంది. సుస్మిత. ‘‘ఈ క్యారెక్టర్ సూటయ్యే దుస్తుల కోసం చాలా ప్రయోగాలే చేశాం. ఇందులో చరణ్ వేసుకున్న తరహా బట్టలేవీ ఇప్పుడెవరూ బయట వేసుకోవడం లేదు. అంతేకాదు.. దుస్తులు కొత్తగా అనిపించడమే కాదు.. అవి చరణ్ కు కంఫర్ట్ గా కూడా అనిపించాలి. అదే ఛాలెంజ్ లా తీసుకుని కాస్ట్యూమ్స్ పని పూర్తి చేశామని చెప్పుకొచ్చింది.
‘‘పుట్టినప్పటి నుంచి పిల్లలను వదిలి ఎప్పుడూ ఉండలేదు. ఖైదీ సినిమా కోసం వాళ్లను వదిలి పనిలో మునిగిపోవాల్సి వచ్చింది. అప్పుడు మా ఆయనే పిల్లల పట్ల మరింత కేర్ తీసుకుని నేను దగ్గరలో లేనన్న ఫీలింగ్ లేకుండా చూసుకున్నాడు. ఇప్పుడు రంగస్థలం అయిపోతుండగా సైరా కోసం డిజైనింగ్ మొదలెట్టేశాను. పిల్లలు.. ఫ్యామిలీతో గడపడటానికి టైం చిక్కడం లేదు అదొక్కటే లోటు’’ అని పర్సనల్ లైఫ్ గురించి సుస్మిత చెప్పుకొచ్చింది.