తనీ ఒరువన్.. కొత్తగా పరిచయం చేయాల్సిన పేరు కాదిది. రెండు మూడు నెలలుగా టాలీవుడ్లో పెద్ద చర్చనీయాంశమైన పేరిది. నాలుగు నెలల కిందట తమిళంలో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్టయిన ఈ సినిమాను రామ్ చరణ్ రీమేక్ చేయాలని నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే. ఐతే వేరే భాషల నుంచి తెలుగులోకి ఓ సినిమాను రీమేక్ చేయాలనుకున్నపుడు ఒరిజినల్ నే యథాతథంగా తీయాలా లేక నేటివిటీ పేరుతో మార్పులేమైనా చేయాలా అన్న బేసిక్ క్వశ్చన్ ఒకటి ఎదురవుతుంది. ఈ విషయంలో రామ్ చరణ్ పెద్ద డైలమాలో ఉన్నాడు. అందుకే చాన్నాళ్ల కిందటే సినిమా ఓకే అయినా.. ఇప్పటిదాకా మొదలు కాలేదు.
మార్పులు చేయడం కంపల్సరీ అన్న ఉద్దేశంతో డైరెక్టర్ సురేందర్ రెడ్డి అండ్ టీమ్ రెండు నెలలుగా ఆ పని మీదే ఉందట. కానీ చేసిన మార్పులు అంత సంతృప్తికరంగా లేకపోవడంతో అయోమయం నెలకొంది. సరిగ్గా ఆ సమయంలోనే సీన్ లోకి చిరంజీవి ఎంటరయ్యాడట. ‘తనీ ఒరువన్’ యూనివర్శల్ సబ్జెక్ట్ అని.. అందులో నేటివిటీ ఫీల్ ఏమీ లేదని.. స్క్రీన్ ప్లే ప్రధానంగా నడిచే ఈ యాక్షన్ థ్రిల్లర్ని యథాతథంగా తీస్తేనే బాగుంటుందని చెప్పాడట. దీంతో మార్పులు చేర్పుల సంగతి పక్కనబెట్టేసి ఉన్నదున్నట్లు తీయడానికి సిద్ధమైందట సురేందర్ టీం. తమిళంలో విలన్ గా నటించిన అరవింద్ స్వామిని, మ్యూజిక్ డైరెక్టర్ హిప్ హాప్ తమిళ్ ను తెలుగు వెర్షన్ కు కన్ఫమ్ చేయడానికి కూడా చిరు సూచనలే కారణమట. కాబట్టి ‘తనీ ఒరువన్’ విషయంలో ఓ క్లారిటీ వచ్చేసిందని.. ఇంకొన్ని రోజుల్లోనే సినిమా సెట్స్ మీదికి వెళ్తుందని సమాచారం.