క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో రూపొందుతున్న రంగమార్తాండ సినిమా చిత్రీకరణ ఇటీవలే పూర్తి అయ్యింది. దాదాపుగా మూడు ఏళ్లుగా ఈ సినిమా గురించి వార్తలు వస్తున్నాయి. గత ఏడాది ఈ సినిమా విడుదల అవుతుంది అనుకుంటే కరోనా వల్ల ప్లాన్ చేంజ్ అయ్యింది. రంగమార్తాండ సినిమా షూటింగ్ ను ఎట్టకేలకు పూర్తి చేసిన క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ విడుదలకు సిద్దం చేస్తున్నాడు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లో ఉన్న రంగమార్తాండ కోసం మెగాస్టార్ చిరంజీవి తనవంతు సాయంను అందించాడు. కృష్ణవంశీ విజ్ఞప్తి మేరకు రంగమార్తాండ కోసం వాయిస్ ఓవర్ ను చిరంజీవి ఇచ్చేందుకు ఓకే చెప్పాడు.. ఇటీవల ఆ పని కూడా పూర్తి చేయడం జరిగింది. చేయికి చిన్నపాటి ఆపరేషన్ అవ్వడంతో షూటింగ్ కు వెళ్లకుండా పూర్తిగా ఇంటికే పరిమితం అయిన చిరంజీవి ఈమద్య సినీ ప్రమోషన్ లకు మరియు ఇలాంటి చిన్న చిన్న గెస్ట్ అప్పియరెన్స్ కు ఓకే చెప్తున్నాడు.
రంగమార్తాండ సినిమా సూపర్ హిట్ క్లాసిక్ మరాఠి మూవీ నటసామ్రాట్ కు రీమేక్ అనే విషయం తెల్సిందే. ప్రకాష్ రాజ్ మరియు రమ్యకృష్ణ లు కీలక పాత్రలో ఈ సినిమాలో కనిపించబోతున్నారు. బ్రహ్మానందం.. రాహుల్ సిప్లిగంజ్.. శివాత్మిక రాజశేఖర్ మరియు అనసూయ వంటి ప్రముఖ నటీ నటులు ఈ సినిమాలో నటించారు. ఈ సినిమా కోసం కృష్ణవంశీ సుదీర్ఘ కాలంగా కష్టపడుతున్నాడు. ఇది ఒక రీమేక్ అయినా కూడా తనదైన క్రియేటివిటీని ఉపయోగిస్తున్నట్లుగా తెలుస్తోంది. క్రియేటివ్ డైరెక్టర్ రీమేక్ సినిమా ఏంటీ అంటూ కొందరు పెదవి విరిచారు. కాని ఆయనకు ఈ సినిమా అంతగా నచ్చిందని.. ఎన్నో ఆఫర్లు మరెన్నో పెద్ద సినిమాల ఛాన్స్ లు వచ్చినా కూడా కృష్టవంశీ ఈ సినిమాను మెల్లగా పూర్తి చేశారనే టాక్ వినిపిస్తుంది.
ఇప్పటికే రంగమార్తాండ సినిమాకు మంచి క్రేజ్ ఉంది. ఇలాంటి సమయంలో మెగాస్టార్ చిరంజీవి తన వాయిస్ ను ఈ సినిమాకు అందించడంతో సినిమా స్థాయి మరింతగా పెరిగినట్లయ్యింది. అద్బుతమైన కథ మరియు కథనంతో ఈ సినిమాను కృష్ణవంశీ రూపొందించాడు. సినిమా పరిశ్రమ మరియు రంగస్థల నటుల జీవితాలు ఇతర విషయాల గురించి ఈ సినిమాలో చాలా చక్కగా చూపించడం జరిగింది. ప్రకాష్ రాజ్ మరియు రమ్యకృష్ణ లను ఫుల్ గా వాడేసిన కృష్ణవంశీ ప్రేక్షకులతో కన్నీరు పెట్టించడం ఖాయం అంటున్నారు. వచ్చే ఏడాది ఆరంభంలో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేలా ప్లాన్ చేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది. త్వరలోనే సినిమా విడుదల తేదీ పై మరింత స్పష్టత కృష్ణవంశీ ఇస్తాడని ఆశిద్దాం. ఇది ఆయనకు కమ్ బ్యాక్ మూవీ అవ్వాలని ఆయన అభిమానులు ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు.