25 ఏళ్ళు చిరు ఎందుకు దూరంగా ఉన్నారు?

Update: 2019-08-21 07:37 GMT
నిన్న ముంబైలో గ్రాండ్ గా జరిగిన సైరా నరసింహారెడ్డి టీజర్ లాంచ్ లో అక్కడి మీడియాకి టీమ్ ను మంచి ప్రశ్నలు అడిగే ఛాన్స్ దొరికింది. ఎవరిని వదలకుండా అందరి దగ్గరా సమాధానాలు రాబట్టుకున్న ప్రతినిధులు చిరు ఇంత కాలం బాలీవుడ్ కు దూరంగా ఉండటం గురించి అడిగారు. దానికి కారణం లేకపోలేదు. చిరు చేసిన చివరి హిందీ స్ట్రెయిట్ మూవీ ది జెంటిల్ మెన్. ఇది 1994లో విడుదలైంది.

అంతకు ముందు ఆజ్ కా గూండా రాజ్ - ప్రతిబంద్ కమర్షియల్ సూపర్ సక్సెస్ ని అందుకుని కొన్ని కేంద్రాల్లో శతదినోత్సవాలు కూడా జరుపుకున్నాయి. ఆ టైంలో చిరంజీవి ఇకపై రెగ్యులర్ గా హిందీ సినిమాలు చేస్తారనే టాక్ కూడా పత్రికల్లో వచ్చేది. కట్ చేస్తే ఆ తర్వాత చిరు మళ్ళీ వాటి జోలికే వెళ్ళలేదు. అందుకే ఈ సందర్భాన్ని వాడుకుని జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు చిరు ఆన్సర్ ఇచ్చారు

నిజానికి దానికి స్పష్టమైన కారణం తనకూ తెలియదని తెలుగు సినిమాల్లో విపరీతంగా బిజీ కావడం ఆ తర్వాత రాజకీయాల్లో కొన్నేళ్లు గడపాల్సి రావడం లాంటి కారణాల వల్ల బాలీవుడ్ గురించి ఆలోచించలేకపోయానని చెప్పారు. అయితే ఇప్పుడు ఇలాంటి అన్ సంగ్ హీరో అనిపించుకున్న ఫ్రీడమ్ ఫైటర్ కథ ద్వారా రీ ఎంట్రీ ఇవ్వడం చాలా సంతోషంగా ఉందని చెప్పడం  ఆకట్టుకుంది.

మొత్తానికి చిరు తన పాతికేళ్ల గ్యాప్ గురించి స్పష్టమైన సమాధానం ఇచ్చేశారు. అక్టోబర్ 2న విడుదల కానున్న సైరా హిందీలోనూ భారీ ఎత్తున రిలీజ్ కు ప్లానింగ్ జరుగుతోంది. సీమకు చెందిన యోధుడి కథే అయినా అన్ని రాష్ట్రాల ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే తరహాలో యునివర్సల్ అప్పీల్ తో ఇది రూపొందించినట్టు చెబుతున్నారు.


Tags:    

Similar News