మెగాస్టార్ చిరంజీవి 67 ఏళ్ల వయస్సులోనూ ఫుల్ బిజీగా సినిమాలు చేస్తూ గడుపుతున్నారు. సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత వరుసబెట్టి ప్రాజెక్టులను ఓకే చేస్తూ జెట్ స్పీడుతో దూసుకెళుతున్నారు. ఇటీవల 'గాడ్ ఫాదర్' మూవీతో బ్లాక్ బస్టర్ హిట్టందుకున్న చిరంజీవి 'వాల్తేరు వీరయ్య'తో ఈ సంక్రాంతికి రాబోతున్నాడు.
150 పైకి పైగా సినిమాల్లో నటించడంతో పాటు సామాజిక సేవలోనూ చిరంజీవి అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు. కరోనా సమయంలో సీసీసీని స్థాపించి సినీ కార్మికులను తనవంతు బాధ్యతగా ఆదుకున్నారు. బ్లడ్ బ్యాంక్.. ఐ బ్యాంక్.. ఆక్సిజన్ బ్యాంక్ లు స్థాపించి ఎంతోమంది జీవితాల్లో వెలుగులు నింపారు.
ఈక్రమంలోనే మెగాస్టార్ చిరంజీవికి గత నెలలో జరిగిన 53వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా-2022కి గాను ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ అవార్డు దక్కింది. గతంలోనే చిరంజీవికి కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన పద్మభూషణ్ అవార్డును ఇచ్చి సత్కరించింది. చిరంజీవి రాజకీయాల్లో ఉన్నప్పుడు టూరిజం శాఖ మంత్రిగానూ ప్రజలకు సేవలందించారు.
రాజకీయాల్లో అవినీతి మచ్చ అంటించుకోకుండా తిరిగి సినిమాల్లోకి వచ్చి తనదైన శైలిలో అభిమానులను అలరిస్తూ ముందుకు పోతున్నారు. ఇక చిరంజీవి గత వారం గోవాకు షూటింగ్ నిమిత్తం వెళ్లగా అక్కడి నావికాదళ అధికారులు ఆయనను కలుసుకున్నారు. ఈ సందర్భంగా వారంతా మెగాస్టార్ తో ఫోటోలు.. సెల్ఫీలు తీసుకున్నారు.
ఈక్రమంలోనే నావెల్ డే ను పురస్కరించుకుని మెగాస్టార్ చిరంజీవి తన ట్విటర్లో 'హ్యాపీ నేవీ డే.. 'గోవా డైరీస్' అంటూ హ్యష్ ట్యాగ్ తో ట్వీట్ చేస్తూ శుభాకాంక్షలు తెలిపారు. అలాగే తన గత స్మృతులను స్మరించుకున్నారు. తాను కాలేజీ చదువుతున్న రోజుల్లో ఎన్ఎస్ఎస్ కోసం నమోదు చేసుకున్న నేవీపై ఆసక్తి పెరిగిందని తెలిపారు. నేవెల్ క్యాడెట్ గా ఎన్ఎస్సీలో కొనసాగడం సంతోషాన్ని ఇచ్చిందని పేర్కొన్నారు.
చిరంజీవి తన ట్విటర్లో నేవీ సిబ్బందితో దిగిన ఫొటోలను షేర్ చేయగా క్షణాల్లో వైరల్ అయింది. ఈ క్రమంలోనే ఓ అభిమాని చిరంజీవి 1986లో 'చాణక్య శపథం' సినిమాలో కస్టమ్స్ ఆఫీసర్ గా నటించిన ఫోటోను చిరంజీవికి ట్వీట్ చేశాడు. ఈ సినిమాలో నటుడికి అదే గెటప్ ఉందంటూ ఆ అభిమాని రాసుకొచ్చారు. ఈ పిక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.