మెగాస్టార్ చిరంజీవి - కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న తాజా చిత్రం ''ఆచార్య''. కొణిదెల ప్రొడక్షన్స్ సమర్పణలో మాట్నీ మూవీస్ బ్యానర్ పై నిరంజన్ రెడ్డి - రామ్ చరణ్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కరోనా కారణంగా నిలిచిపోయిన 'ఆచార్య' షూటింగ్ ఇటీవలే తిరిగి ప్రారంభించారు. చిరు కూడా సెట్స్ లో అడుగుపెట్టేశారు. హైదరాబాద్ సమీపంలోని కోకాపేట లో 16 ఏకరాల్లో ప్రత్యేకంగా వేసిన సెట్ లో చిత్రీకరణ జరుపుతున్నారు. దీని కోసం సుమారు 20 కోట్లు ఖర్చు పెట్టినట్లు టాక్. ఇందులో ఓ సాంగ్ షూట్ చేశారని తెలుస్తోంది. ఈ సాంగ్ లో హీరోయిన్ కాజల్ కిచ్లు పాల్గొనలేదు. ఇది చిరంజీవి ఇంట్రో సాంగ్ అయి ఉంటుందని అంటున్నారు.
కాగా, చిరంజీవి పాల్గొనే ఈ షెడ్యూల్ లో సినిమాలోని కీలకమైన సన్నివేశాలతో ఎక్కువ భాగం షూటింగ్ పూర్తవుతుందని తెలుస్తోంది. 'ఆచార్య' బడ్జెట్ మొత్తం దాదాపు 120 కోట్లు వరకు ఉండొచ్చని.. నాన్ థియేట్రికల్ రైట్స్ కి వచ్చిన అడ్వాన్సులుతోనే ఈ సినిమా షూటింగ్ అయిపోతుందని సినీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. 'ఆచార్య' లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా కీలక పాత్రలో నటించనున్నాడు. కొరటాల తరహా సందేశాత్మక అంశాలతో కమర్షియల్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రం రూపొందనుంది. ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తుండగా తిరు సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నారు. 'ఆచార్య' ను 2021 వేసవిలో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేలా చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది.