దేశంలోనే టాప్ 1 డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు రాజ్ కుమార్ హీరాణి. అలాంటి దర్శకుడి నుంచి ఓ సినిమా వస్తోంది అంటే ప్రపంచవ్యాప్తంగా అభిమానులంతా ఎంతో అటెన్షన్ తో ఎదురు చూస్తుంటారు. సంజయ్ దత్ - అర్షద్ వార్షీ హీరోలుగా అతడు తెరకెక్కించిన మున్నాబాయ్ ఎంబిబిఎస్ - లగేరహో మున్నాబాయ్ వంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచాయి. సంజయ్ దత్ కెరీర్ లోనే ది బెస్ట్ సినిమాలుగా నిలిచాయి. ఆ సినిమాల్ని తెలుగులో మెగాస్టార్ చిరంజీవి రీమేక్ చేసి ఇక్కడా ఘనవిజయం సాధించారు.
ఇప్పటికీ మెగాస్టార్ కి ఎంతో ఇష్టమైన సినిమాలు అవి. శంకర్ దాదా ఎంబిబిఎస్ - శంకర్ దాదా జిందాబాద్ పేర్లతో తెరకెక్కిన ఆ సినిమాల్లో కామెడీ తనకి ఎంతో ఇష్టమని చిరు పలు సందర్భాల్లో చెప్పారు. ఇప్పుడు మున్నాభాయ్ సిరీస్ లో మూడో చిత్రం తెరకెక్కించేందుకు రాజ్ కుమార్ హిరాణి సన్నాహాలు చేస్తున్నారు. సంజయ్ దత్ - అర్షద్ వార్షీ కథానాయకులుగా నటిస్తున్నారు. ఈ సంగతిని ముంబై ఫిలింఫెస్టివల్స్ మామిలో కన్ఫమ్ చేశారు హిరాణి. ఇప్పటికే కథ రెడీ అయ్యింది. సెట్స్ కెళ్లడానికి వెయిటింగ్ అని అన్నారు. అయితే మెగాస్టార్ చిరంజీవి తన కెరీర్ లో 150వ సినిమాలో నటించేందుకు సిద్ధమవుతున్న ఈ వేళ కథ ఏదీ సెట్టవ్వడం లేదు.
మరి రాజ్ కుమార్ హీరాణీని అడిగి ఆ మూడో భాగం కథేతో తీసుకోవచ్చు కదా! అని అభిమానులు అడుగుతున్నారు. శంకర్ దాదా సిరీస్ చిరు ఇమేజ్ కి తగ్గట్టే ఎంతో డిగ్నిఫైడ్ గా కూడా ఉంటుంది. మానవత్వం - విలువల నేపథ్యంలో కామెడీ ఎంటర్ టైనర్ లుగా తెరకెక్కాయి కాబట్టి ఇప్పటి ట్రెండ్ కి కూడా సూటవుతుంది. మరి చిరు రెడీనా? ప‌్రయత్నాలు చేస్తున్నారా?