న్యూ ఇయర్ కి చిరు మాట

Update: 2018-01-01 12:57 GMT
కొత్త సంవత్సరం సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి తొలి రోజున ప్రత్యేకంగా అభిమానులను తన ఇంటి దగ్గర కలుసుకున్నారు. మొన్నటి దాకా గుబురు గెడ్డంతో గంభీరంగా రఫ్ లుక్ తో కనిపించిన చిరంజీవి నిన్న ఫాన్స్ మీట్ లో మాత్రం గెడ్డం తీసేసి  క్లీన్ షేవ్ తో పాత చిరంజీవిలాగా మారిపోయారు. ఇన్నాళ్ళు గెడ్డం పెంచింది సైరా సినిమా కోసమే అనుకున్న ఫాన్స్ ఇప్పుడు ఈ లుక్ చూసి షాక్ అవుతున్నారు. కాని రెట్టించిన గ్లోతో ఫ్రెష్ గా కనిపించడంతో ఆనందపడ్డారు. చాలా సేపు అభిమానులతో టైం స్పెండ్ చేసిన చిరు తన న్యూ ఇయర్ మెసేజ్ కూడా ఇచ్చారు. ఎవరికైనా తల్లితండ్రులు - కుటుంబం ముఖ్యమని  - వాళ్ళ మీద ప్రేమాభిమానాలు కలిగి ఉండటమే కాకుండా సమాజానికి కూడా సేవ చేయటం కొనసాగించాలని కోరారు. చాలా ఓపిగ్గా ఫాన్స్ ని కలిసి ఫోటోలు దిగిన చిరు ఎక్కడా అలుపు ఉన్నట్టు కనిపించకపోవడం విశేషం.

ఈ సందర్భంగా సైరా సినిమా విశేషాలు కూడా పంచుకున్నారు. తన అభిమానులే కాకుండా యావత్ సినీ ప్రేమికులు గర్వపడే విధంగా సినిమా రూపొందుతోందని, కొంచెం ఆలస్యం అయినా అంచనాలు అందుకోవడంలో విఫలం కాకూడదు అనే ఉద్దేశంతోనే దీన్ని ఒక మహా యజ్ఞంలా తీర్చిదిద్దుతున్నట్టు తెలిపారు. చాలా దూరం నుంచి ఇతర ప్రాంతాల నుంచి సైతం అభిమానులు తరలి రావడంతో చిరు ఇల్లు సందడిగా మారింది. తాకిడి ఎక్కువగా ఉండటంతో కొంత సేపు అయోమయం నెలకొంది. చిరు స్వయంగా బయటికి వచ్చి అభివాదం చేయటంతో అక్కడంతా సర్దుకుంది. రామ్ చరణ్ రంగస్థలం గురించి కొందరు ప్రస్తావించినా ఇది సందర్భం కాదని - చరణ్ నే అడగండని చెప్పడం గమనార్హం. సైరా సెకండ్ షెడ్యూల్ మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానుంది.
Tags:    

Similar News