ఈసారి ‘నో’ అన్నావో అంతే చిరూ..

Update: 2015-10-30 17:30 GMT
చిరంజీవి రీఎంట్రీ మూవీ విషయంలో మళ్లీ సస్పెన్స్ నడుస్తోంది. ఈ సినిమా విషయంలో కథ మళ్లీ మొదటికి వచ్చిందని.. ‘కత్తి’ రీమేక్‌ ను కూడా పక్కనబెట్టేసినట్లే అని.. మళ్లీ జీరో నుంచి పని మొదలవుతుందని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే చిరును మళ్లీ హీరోగా చూడ్డం కోసం ఏళ్లుగా ఎదురు చూస్తూ విసిగిపోయి ఉన్నారు అభిమానులు. ఫ్యాన్స్ సంగతి పక్కనబెడితే.. సామాన్య జనాలు కూడా చిరు రీఎంట్రీ విషయంలో చాలా ఫ్రస్టేషన్ తో ఉన్నారు. ఇండస్ట్రీ జనాలదీ ఇదే పరిస్థితి.

ఓ సినిమా గురించి మరీ ఇన్నేళ్లు ఎదురు చూడటం, ఇంత చర్చ జరగడం.. ఏళ్ల తరబడి ఊగిసలాట సాగడం.. టాలీవుడ్ లో ఇంతవరకు జరగలేదు. ఐతే ఇంతకుముందు ఎంత ఫ్రస్టేషన్‌ కు గురైనప్పటికీ.. ఈ మధ్య తన రీఎంట్రీ మూవీ గురించి ఇంకొన్ని రోజుల్లో ప్రకటన అన్నపుడు జనాలు హమ్మయ్య అనుకున్నారు. ‘కత్తి’ రీమేక్ పక్కా అని, వి.వి.వినాయకే దర్శకుడని ఫిక్సయిపోయి ఆ ప్రకటన కోసం ఎదురు చూస్తున్నారు. మళ్లీ ఇప్పుడు ఆ సినిమా క్యాన్సిల్ అంటుంటే జనాలకు చిర్రెత్తుకొస్తోంది. అదే నిజమైతే మాత్రం.. చిరు-150 మీద ఆసక్తి కాస్తా అసహనంగా మారిపోయి.. జనాల్లో వ్యతిరేక భావం వచ్చేయడం ఖాయం.

జనాల సంగతి వదిలేస్తే ఇప్పటికే చిరంజీవి 150వ సినిమా విషయంలో దర్శకులు, రచయితల్లోనూ ఓ వ్యతిరేక భావం వచ్చేసింది. ఆయన్ని మెప్పించడం మన వల్ల కాదు బాబో అన్న భావనలో ఉన్నాడు ఇండస్ట్రీ జనాలు. చిరు కోసం కథలు వండిన రచయితలు - దర్శకులు రిగ్రెట్ అవుతున్న పరిస్థితి. వాళ్లు వేరే జనాల దగ్గర దండాలు పెట్టేస్తున్నారు. ఇప్పటికే పూరి జగన్నాథ్ విషయంలో మెగా ఫ్యామిలీ వ్యవహరించిన తీరుపై విమర్శలున్నాయి. ఇప్పుడు వినాయక్‌ కు కూడా టాటా చెప్పేస్తే ఇకపై ఎవ్వరూ చిరుతో సినిమా విషయంలో ఆసక్తి చూపే పరిస్థితి ఉండదు. కాబట్టి రీఎంట్రీ విషయంలో మరీ అతిగా ఆలోచించకుండా ఏదో ఒక సినిమా చేసేస్తే బెటర్. అది కత్తి రీమేక్ అయినా కావచ్చు, ఆటోజానీ అయినా కావచ్చు. ఏదో ఒకటి కానిచ్చేసి రంగంలోకి దిగితే.. తర్వాత ఫలితం ఎలా ఉన్నా ఓకే. ఈసారికి హిట్టు కొడితే ఓకే.. లేకుంటే తర్వాతైనా మంచి రిజల్ట్ రాకపోదు కదా.
Tags:    

Similar News