మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా నటించే 150వ సినిమాని రామ్ చరణ్ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. తన మాతృమూర్తి సురేఖతో కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తానని చరణ్ ఇదివరకే ప్రకటించారు. ఈ సినిమాకి బడ్జెట్ పరంగా పరిమితులేవీ లేవని చెప్పాడు. అయితే బడ్జెట్ పరమైన లిమిటేషన్స్ విషయంలో చిరంజీవి తన ఒపీనియన్ ని ఓపెన్ గానే చెప్పారట.
ఈ సినిమాకి అన్ లిమిటెడ్ బడ్జెట్ అవసరం లేదు. కత్తి సినిమాని ఒరిజినల్ గా రూ.60 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించారు. రీమేక్ కాబట్టి మహా అయితే మరో 10 కోట్లు మాత్రమే అదనంగా ఖర్చవుతుంది. అంతకుమించి పెట్టొద్దని చిరంజీవి చెప్పారుట. అనవసరంగా ఖర్చు చేసి చేతులు కాల్చుకోవడం కరెక్ట్ కాదని అన్నారుట. అయితే ఈ మార్పు అంతా బ్రూస్ లీ పరాజయం వల్లనేనని చెబుతున్నారు. అంటే ముందస్తుగానే మెగా ప్రాజెక్టుకి బడ్జెట్ రూ.70 కోట్లు అని ఫిక్సయినట్టే. ఫిబ్రవరి 2016లో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. వి.వి.వినాయక్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు.
ఇప్పటికే తెలుగు వెర్షన్‌కి తగ్గట్టే మార్పు చేర్పులు చేస్తున్నారు. కొద్దిరోజుల్లోనే కథానాయిక ఎవరన్నది ఫైనల్ చేసేస్తారని తెలుస్తోంది. మెగాస్టార్ చిరంజీవి సరసన సూటయ్యే సీనియర్ నాయికల కోసం సెర్చ్ చేస్తున్నారు. అదీ సంగతి.