మెగా హీరో వరుణ్ తేజ్ తాజా చిత్రం తొలిప్రేమ మెగా అభిమానులనే కాదు.. మెగా స్టార్ చిరంజీవిని కూడా మెప్పించింది. తాజాగా ఈ సినిమా చూసిన చిరు ఈ సినిమా డైరెక్టర్ వెంకీ అట్లూరి.. హీరో వరుణ్ ను తెగ మెచ్చుకున్నారు. తన తమ్ముడు పవన్ కళ్యాణ్ మూవీ తొలిప్రేమ సినిమా టైటిల్ ఈ మూవీకి పెట్టినప్పటి నుంచే దీనిపై తనకు తెగ క్యూరియాసిటీ ఏర్పడిందని... ఈ మూవీ చూశాక తాను పూర్తిగా హ్యాపీగా ఫీలయ్యానని చిరు చెప్పుకొచ్చారు.
‘‘తొలిప్రేమ కథగా చెప్పుకుంటే ఏమీ లేదు. మొత్తం సిట్యుయేషనల్ గానే ఉంటుంది. సీన్ తరవాత సీన్ ఆసక్తిగా ఉండేలా అల్లుకుంటూ రావడం ఆషామాషీ విషయం కాదు. వరుణ్ సినిమాలకు కొత్త కాదు. హీరోయిన్ రాశీఖన్నా కొత్త కాదు. కానీ సినిమా చూసిన వారంతా ఒక ఫ్రెష్ ఫీల్ తో బయటకు వచ్చారంటే ఆ ఘనత డైరెక్టర్ దే. ఇలాంటి డైరెక్టర్లు ఇండస్ర్టీకి రావాలి. వరుణ్ గత సినిమాలతో పోల్చుకుంటే పరిణతి చెందిన నటుడిలా కనిపించాడు. ముఖ్యంగా వరుణ్ బాడీకి.. హైట్ కి డ్యాన్సులు ఎంతవరకు కుదురుతాయా అనేది నాకు లోపల్లోపల ఎప్పుడూ డౌటుగానే ఉండేది. కానీ తన బాడీలాంగ్వేజ్ కు తగ్గట్టుగా డ్యాన్సులు చేసి ఆకట్టుకున్నాడు. మొత్తం మీద మా ఫ్యామిలీ అంతా గర్వపడే సినిమా చేశాడంటూ’’ చిరు తొలిప్రేమ సినిమాను ప్రశంసలతో ముంచెత్తారు.
తొలిప్రేమ సినిమా 65 రోజుల్లో కంప్లీట్ చేసిన విషయం చిరు ప్రత్యేకంగా ప్రస్తావించాడు. ‘‘ఖర్చుకు వెనుకాడని ప్రొడ్యూసర్స్ దొరకొచ్చు. అలాగని టైం వేస్ట్ సరికాదు. స్క్రిప్టు పక్కాగా సిద్ధం చేసుకుని లాక్ చేసుకుంటే అనుకున్న టైంలోనే సినిమా పూర్తి చేసేయొచ్చు. దానివరకు చూసుకుంటే ఇది ట్రెండ్ సెట్ చేసే సినిమా’’అని టైం ఇంపార్టెన్స్ గురించి కూడా చిరు తన అభిప్రాయం ఓపెన్ గా చెప్పేశారు.