ఇప్పటి హీరోలంటే ప్రతీ సినిమాలోనూ ఒక రేంజ్ హీరోయిజమ్ చూపిస్తున్నారు. అందరూ క్లాసే. కాస్ట్‌లీ కార్లు, ట్రెండీ బైకులూ, భారీ భారీ డబ్బుతో మాత్రమే కొనగలిని వాహనాల్లోనే వీరు తిరుగుతున్నారు. అయితే ఒకప్పుడు చిరంజీవి, బాలయ్య, నాగ్ వంటి హీరోలు మాత్రం రిక్షా తొక్కే వ్యక్తిగా, లారీ డ్రైవర్ గా, జట్కా బండి నడిపేవాడిగా నటించారు. ఇప్పటి హీరోలు అలా చేస్తారో చేయరో కాని, మెగాస్టార్ మాత్రం రియల్ లైఫ్ లో కూడా ఆటో నడిపానని అంటున్నారు.
''కాలేజీ రోజుల్లో నేను ఎన్ సీసీ కేడెట్ ని. నాటి ప్రధాని ఇందిరా గాంధీ సమక్షంలో పోలేరమ్మ పోతురాజు ప్లే వేస్తున్నాం. అప్పుడు పోలేరమ్మగా చేస్తున్న అమ్మాయి సొమ్మసిల్లి కింద పడిపోయింది. వెంటనే నేను నా రెండు చేతుల్లోకి తీసుకుని ఆటో దగ్గరికి పరిగెత్తా. ఆటో డ్రైవర్ లేడు. కానీ నేనే డ్రైవ్ చేసుకుంటూ ఆస్పత్రి వరకూ తీసుకెళ్లా. సరైన టైమ్ లో తీసుకొచ్చినందుకు డాక్టర్లు నన్ను ఎంతో ప్రశంసించారు'' అంటూ ఫ్లాష్ బ్యాక్ గుర్తు చేసుకున్నారు. నిజానికి ఆటో జానీ అనే పాత్రను గతంలో రౌడీ అల్లుడు సినిమా కోసం చేసినప్పుడైతేనేమీ, ఇప్పుడు పూరి జగన్ డైరక్షన్ లో ఒకవేళ ఆటో జానీ రోల్ చేయాల్సివస్తేనేమి.. మెగాస్టార్ కు ఆ సీన్ ఎంతో ప్రేరణ అని తెలుస్తోంది. ఆయన రియల్ లైఫ్ లో కూడా ఆటో జానీయే. మరి మెగా ఫ్యామిలీలో నవతరం హీరోలు ఎవరైనా ఇలాంటి పాత్రలు వేస్తారా నాయనా?