దర్శకరత్న దాసరి నారాయణరావు తీవ్ర అస్వస్థకు గురైన నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి ఆందోళనకు గురయ్యారు. పార్లమెంటు సమావేశాల్లో పాల్గొనేందుకు ఢిల్లీకి వెళ్లిన ఆయన దాసరి గురించి విషయం తెలియగానే వెంటనే తిరుగు ప్రయాణమయ్యారు. ఆయన కిమ్స్ ఆసుపత్రికి వెళ్లి దాసరిని పరామర్శించనున్నట్లు సమాచారం.
ఇప్పటికే చిరంజీవి బావ అల్లు అరవింద్.. కిమ్స్ ఆసుపత్రికి చేరుకుని దాసరిని చూసి వచ్చారు. దాసరి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. దాసరి ప్రియ శిష్యుడైన మోహన్ బాబు కూడా ఉదయం నుంచి కిమ్స్ లోనే ఉంటున్నారు. వైద్యులతో కలిసి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. దాసరి చివరిగా పాల్గొన్న పబ్లిక్ ఈవెంట్ చిరంజీవి రీఎంట్రీ మూవీ ఖైదీ నెంబర్ 150 ప్రి రిలీజ్ ఫంక్షనే కావడం గమనార్హం.
ఇక దాసరి ఆరోగ్య పరిస్థితిపై తాజా సమాచారం ప్రకారం ఆయన చికిత్సకు బాగానే స్పందిస్తున్నారు. రెండు మూడు రోజుల్లో సాధారణ స్థితికి వచ్చే అవకాశముంది. దాసరికి ఛాతీ శస్త్ర చికిత్స అనంతరం కిమ్స్ ఎండీ.. సీఈవో డాక్టర్ బొల్లినేని భాస్కరరావు మీడియాతో మాట్లాడుతూ.. దాసరికి ఊపిరితిత్తులు దెబ్బతిన్నాయని.. వాటికి చికిత్స చేసేందుకు వెంటిలేటర్ మీద పెట్టామని చెప్పారు. అన్నవాహికలో ఉన్న పదార్థాల వల్లే ఇన్ఫెక్షన్ వచ్చిందని.. వాటన్నింటినీ శస్త్రచికిత్స ద్వారా తీసేశామని వివరించారు. ఇప్పుడైతే ఆయన బాగున్నారని.. రెండు మూడు రోజుల్లో బాగా కోలుకోడానికి ఆస్కారం ఉందని తెలిపారు.