మెగాస్టార్ చిరంజీవి పాత సినిమాల్లో సూపర్ హిట్ సాంగులెన్నో ఉన్నాయి. వాటిల్లో అభిమానులు ఇప్పటికీ ఇష్టంగా వినే సాంగులు చాలానే ఉన్నాయి. అలాంటి వాటిని ఎంపిక చేసుకుని వాటిని రీమిక్స్ చేసి అదరగొట్టే స్టెప్పులేసి మెగా అభిమానులను మెప్పిస్తూ వచ్చాడు సాయి ధరమ్ తేజ్. దాదాపుగా ప్రతి సినిమాలో ఒక పాటయినా ఇలా ట్రై చేస్తూ వచ్చిన తేజుకు ఈ రీమిక్స్ లు బాగానే కలిసివచ్చాయి.
ప్రస్తుతం సాయి ధరమ్ తేజ్ వి.వి. వినాయక్ డైరెక్షన్ లో సినిమా చేస్తున్నాడు. ఇందులో కూడా చిరు పాత పాటను రీమిక్స్ చేయబోతున్నాడు. కొండవీటి దొంగ సినిమాలోనే ఛమక్ ఛమక్ ఛాం పాటకు తేజు స్టెప్పులేయబోతున్నాడు. కాకుంటే ఈసారి రీమిక్స్ సెంటిమెంట్ గురించి ఆలోచించింది హీరో సాయిధరమ్ కాదట. ఈసారి అందుకోసం గట్టిగా పట్టుపట్టింది డైరెక్టర్ వి.వి.వినాయక్ అనేది సినిమా యూనిట్ లో వినిపిస్తున్న టాక్. వినాయక్ ఇంతకుముందు రామ్ చరణ్ తేజ్ తో నాయక్ సినిమా చేశాడు. అందులో కొండవీటిదొంగ సినిమాలోని శుభలేఖ రాసుకున్నా ఎదలో ఎపుడో సాంగ్ రీమిక్స్ చేశారు. ఆ సినిమా హిట్ కావడంతో అదే సినిమాలో పాట పెడితే ఈసారీ కచ్చితంగా హిట్ వరిస్తుందని వినాయక్ బలంగా నమ్ముతున్నాడట.
సాధారణంగా ఎప్పుడూ సాయి ధరమ్ రీమిక్స్ చేయాలని పట్టు పడుతుంటాడు. కానీ ఈసారి చేయాలని అనుకోకపోయినప్పటికీ వినాయక్ బలవంతం చేయడంతో ఛమక్ ఛమక్ ఛాం పాటను కొత్త బీట్ తో ఈ సినిమాలోనూ వినిపించేందుకు రెడీ అయ్యాడని తెలుస్తోంది. ఏదైనా ఒకే సెంటిమెంట్ ఇద్దరికి సెట్ అవడం అన్నది కాస్త అరుదైన విషయమే.