స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన సరైనోడు ఆడియో విజయోత్సవ సభ.. విశాఖపట్నంలో మెగాభిమానుల మధ్య గ్రాండ్ గా జరిగింది. ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్ గా హాజరైన మెగాస్టార్ చిరంజీవి.. విశాఖతో తన అనుబంధాన్ని పంచుకున్నారు. అంతే కాదు.. తన వారసులుగా ఇండస్ట్రీలోకి వచ్చిన వస్తున్నవారందరికీ తనదైన శైలిలో క్లాస్ కూడా తీసేసుకున్నారు.
'వెనకాల చిరంజీవి ఉన్నాడు... రెడీమేడ్ గా మెగాభిమానులు బోలెడు మంది ఉన్నారు. ఇలా అనుకుని ఇండస్ట్రీలో నిలుద్దామంటే సక్సెస్ కాలేరు. మీరు చేయాల్సిందల్లా కష్టం - కష్టం - కష్టం. దీన్ని నమ్ముకుంటేనే ఎవరైనా విజయం సాధించగలగుతారు' అంటూ చిరు చెప్పిన మాటలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఇక బన్నీని అయితే ఓ రేంజ్ లో పొగిడేశారు మెగాస్టార్. ఇంత మెచ్యూర్డ్ గా అల్లు అర్జున్ మారిపోవడం ఆశ్చర్యం కలిగిస్తోందన్నారు చిరంజీవి.
తనతో అత్యధిక సినిమాలు తీసిన బ్యానర్ అయిన గీతా ఆర్ట్స్ - నిర్మాతగా అల్లు అరవింద్ వేసిన బాటను ప్రశంసించారు చిరు. డైరెక్టర్ బోయపాటి శ్రీనుతో తనకు అన్నయ్య సినిమా నుంచి అనుబంధం ఉందని చెప్పారు మెగాస్టార్. హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ బాగా ప్రొఫెషనల్ అని, బ్రూస్ లీ చిత్రంలో కలిసి నటించామన్న చిరు నోటి వెంట.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అన్న మాట వినిపించగానే సభ అంతా కేరింతలతో మార్మోగిపోయింది. తనకు నాగబాబు - పవన్ కళ్యాణ్ లు ఎలా తమ్ముళ్లో.. అలాగే శ్రీకాంత్ కూడా అన్నారు చిరంజీవి.