'మా' చిరంజీవి.. అదరహో అదరహ

Update: 2016-06-27 05:04 GMT
మెగాస్టార్ చిరంజీవి స్టేజ్ పై డ్యాన్స్ వేశారంటూ.. చిరు డ్యాన్స్ ఫినిషింగ్ ని మాత్రం టీజర్ లో చూపించి మాటీవీ తెగ ఊరించింది. బాస్ ఈజ్ బ్యాక్ అంటూ మెగాస్టార్ అభిమానులు ఆత్రంగా టీవీలకు అతుక్కు పోయేట్టు చేయడంలో బాగానే సక్సెస్ అయింది. రెండు రోజుల పాటు టీజర్ చూపించి.. రెండు నిమిషాలు మాత్రమే పెర్ఫామెన్స్ చేయడం కొంత నిరుత్సాహం కలిగించే విషయమే అయినా.. దానికి ముందు మాటీవీ అనుసరించిన స్ట్రాటజీని అదరహో అనాల్సిందే.

దాదాపు ఒక గంటపాటు మెగా ఎపిసోడ్ ని నడిపించారు. తనికెళ్ల భరణితో స్టార్ట్ చేసి.. దేవిశ్రీ ప్రసాద్ ఎంట్రీ-ఓ సాంగ్ కి పెర్ఫామెన్స్.. తర్వాత నవదీప్ స్టేజ్ పైకి వచ్చాడు. సేమ్ కాసేపు చిరు గురించి.. నెక్ట్స్ మళ్లీ ఓ సాంగ్. ఆ తర్వాత మెగామేనల్లుడు సాయిధరం తేజ్ వచ్చాడు. ఓ ఏవీ.. దానికి సాయి కుమార్ వాయిస్ ఓవర్.. ఇక తేజు కూడా ఓ మెగా సాంగ్ కి చిందులేశాడు. అప్పుడు శ్రీకాంత్ రంగ ప్రవేశం చేశాడు. అందరూ వచ్చాక మెగా స్టార్ గురించి నాలుగు మాటలు చెప్పారు.

అప్పుడు మొదలైంది అసలు సందడి. మెగాస్టార్ చిరంజీవి స్టేజ్ పైకి రాగానే ఆడిటోరియం అంతా స్టాండింగ్ ఒవేషన్. ఆ ఒక్క ఫ్రేమ్ చాలు.. మెగాభిమానుల గుండెలు ఉప్పొంగిపోవడానికి. మెగా 150 గురించి మెగాస్టార్ నోటి వెంట విన్నాక.. అసలు ఈవెంట్ కే హైలైట్ ప్రారంభమైంది. గ్యాంగ్ లీడర్ లో చిక్ చిక్ చేలం పాటకు చిరువేసిన డ్యాన్స్ తో మొత్తం ఆడిటోరియం మెస్మరైజ్ అయిపోయింది. 61ఏళ్ల వయసులో అంత గ్రేస్ తో మెగాస్టార్ డ్యాన్స్ చేయడం చూస్తే.. మొత్తానికి మైండ్ బ్లాంక్ అయిపోయింది.

ఇక చిరు డ్యాన్స్ అయిపోయాక రామ్ చరణ్ వాటర్ బాటిల్ పట్టుకుని పరుగెత్తుకుంటూ రావడం.. బన్నీ కంటి వెంట నీరు కారిపోతుంటే తుడుచుకోవడం.. మాకోసం  మీకు ఇలాంటివి అవసరం అని నాగార్జున అనడం.. మెగాస్టార్ డ్యాన్స్ చేస్తుంటే మా ఫ్యామిలీ అందరి మొహాలు వెలిగిపోయాయి.. మొత్తం తెలుగు ఆడియన్స్ కూడా అంతే అనుకుంటున్నా అని అల్లు అరవింద్ చెప్పడం.. ఇలా చివరి గంట మొత్తం మెగా స్టార్ కి అంకితం అయిపోయింది సినీ మా అవార్డ్స్ ఫంక్షన్.
Tags:    

Similar News