సైరాకు 'వార్‌' దెబ్బ ఉంటుందా?

Update: 2019-08-14 04:44 GMT
మెగాస్టార్‌ చిరంజీవి 151వ చిత్రం 'సైరా నరసింహారెడ్డి' విడుదలకు సిద్దం అయ్యింది. దాదాపు రెండు సంవత్సరాలుగా మెగా ఫ్యాన్స్‌ మరియు సినీ ప్రేమికులు అంతా కూడా ఈ చిత్రం కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న విషయం తెల్సిందే. సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో రామ్‌ చరణ్‌ భారీ బడ్జెట్‌ తో ఈ చిత్రంను నిర్మించాడు. కేవలం తెలుగులో మాత్రమే కాకుండా ఈ చిత్రాన్ని హిందీ మరియు తమిళంలో కూడా భారీ ఎత్తున విడుదల చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అక్టోబర్‌ 2న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రంకు బాలీవుడ్‌ లో 'వార్‌' నుండి గట్టి పోటీ ఎదురయ్యే అవకాశం కనిపిస్తుంది.

బాలీవుడ్‌ ప్రముఖ నిర్మాణ సంస్థ యశ్‌ రాజ్‌ ఫిలింస్‌ నిర్మించిన 'వార్‌' చిత్రంను అక్టోబర్‌ 2న విడుదల చేయబోతున్నట్లుగా అధికారిక ప్రకటన వచ్చింది. అందుకు సంబంధించిన పోస్టర్‌ ను కూడా విడుదల చేశారు. బాలీవుడ్‌ ప్రేక్షకులు ఈ చిత్రంపై చాలా ఆసక్తిగా ఉన్నారు. భారీ యాక్షన్‌ ఎపిసోడ్స్‌.. కార్‌ చేజింగ్‌ లతో పాటు థ్రిల్‌ కు గురి చేసే ఫైట్స్‌ ఈ చిత్రంలో లెక్కకు మించి ఉంటాయట. హృతిక్‌ రోషన్‌ మరియు టైగర్‌ ష్రాప్‌ వంటి ఇద్దరు స్టార్స్‌ ఈ చిత్రంలో కలిసి నటించడం వల్ల కూడా 'వార్‌' పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి.

ఇప్పటికే విడుదలైన పోస్టర్స్‌ మరియు వీడియోలు సినిమాపై బాలీవుడ్‌ ప్రేక్షకుల్లో అంచనాలు పెంచాయి. ఇలాంటి సమయంలో 'సాహో' చిత్రం బాలీవుడ్‌ ప్రేక్షకుల నుండి ఏ మేరకు ఆధరణ పొందుతుందో అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. సైరా చిత్రంలో అమితాబచ్చన్‌ ఉన్న కారణంగా సినిమా ను హిందీ ప్రేక్షకులు ఆధరిస్తారనే నమ్మకంతో యూనిట్‌ సభ్యులు ఉన్నారు. అమితాబ్‌ ను ముందుంచి ప్రమోషన్స్‌ చేసి సినిమాను ప్రేక్షకుల దృష్టిలో పడేలా చేయాలని సైరా మేకర్స్‌ ప్లాన్‌ చేస్తున్నారు. మరి వార్‌ పోటీ నుండి సైరా ఎలా బయట పడుతుందా అనేది చూడాలి.

Tags:    

Similar News