మెగాస్టార్ చిరంజీవి టైటిల్ పాత్రలో నటిస్తున్న చిత్రం `సైరా-నరసింహారెడ్డి`. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్స్ కంపెనీ పతాకంపై మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నిర్మిస్తున్నారు. డాడ్ కోసం అన్ లిమిటెడ్ బడ్జెట్ కేటాయిస్తున్నామని చరణ్ తొలి టీజర్ ఈవెంట్ లో ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రకటించడమే కాదు.. ప్రాక్టికల్ గా దానిని చేసి చూపిస్తున్నారు రామ్ చరణ్. సైరా చిత్రాన్ని పాన్ ఇండియా కాన్వాసులో అత్యంత భారీగా రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అందుకు తగ్గట్టే కంటెంట్ ని ఎంపిక చేసుకుని విజువల్ వండర్ ని ఆవిష్కరించేందుకు తపిస్తున్నారు. నాన్నకు ప్రేమతో చరణ్ ఇస్తున్న కానుక కాబట్టి అందుకు తగ్గట్టే విజువల్స్ విషయంలో ఏమాత్రం రాజీకి వచ్చేందుకు చరణ్ సిద్ధంగా లేరని సన్నిహిత వర్గాల ద్వారా తెలుస్తోంది. జార్జియాలో చిత్రీకరించిన యాక్షన్ ఎపిసోడ్స్ - అల్యూమినియం ఫ్యాక్టరీ పరిసరాల్లోని సెట్ లో తెరకెక్కించిన సన్నివేశాలు సినిమాకి చాలా కీలకమైనవి. సమరయోధుడి వీరత్వానికి సంబంధించిన సన్నివేశాలు నభూతోనభవిష్యతి అన్న తీరుగా తీర్చి దిద్దేందుకు వీఎఫ్ ఎక్స్ టీమ్ తో కలిసి పని చేస్తున్నారట. స్వాతంత్ర సమరాన్ని ఆరంభించిన తెలుగు వీరుడు ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి కథను విజువల్ వండర్ ని తలపించేలా చూపించడాన్ని కొణిదెల టీమ్ ఛాలెంజ్ గా భావిస్తోందట.
మార్చి తొలి వారంలో `సైరా` కీలక షెడ్యూల్ ప్రారంభించనున్నారు. ఈ షెడ్యూల్ లో అత్యంత టిపికల్ సన్నివేశాల చిత్రీకరణ పూర్తి చేస్తారట. అటుపై మూవీలోని కీలక నటీనటులందరితో ఓ సన్నివేశాన్ని నాలుగు రోజుల పాటు తెరకెక్కిస్తారు. దీనితో షూటింగ్ పూర్తవుతుంది. నిర్మాణానంతర పనుల్లో భాగంగా డబ్బింగ్ - రీరికార్డింగ్ - డీఐ వగైరా పూర్తి చేస్తారు. ఈ చిత్రంలో నయనతార కథానాయిక. తమన్నా వేరొక కీలక పాత్రలో నటిస్తోంది. విజయ్ సేతుపతి - కిచ్చా సుదీప్ - జగపతి బాబు వంటి భారీ తారాగణం ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. బిగ్ బి అమితాబ్ పాత్ర సినిమాకి ఎంతో కీలకమైనదని తెలుస్తోంది.
ప్రస్తుతం `సైరా` బిజినెస్ గురించి ట్రేడ్ వర్గాల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో పలు ఏరియాల నుంచి ఫ్యాన్సీ ఆఫర్లు వస్తున్నాయని ఇదివరకూ ప్రచారమైంది. అలాగే ఓవర్సీస్ బిజినెస్ గురించి చర్చలు సాగుతున్నాయట. అమెరికా సహా ఓవర్సీస్ రైట్స్ కి ఏకంగా 40కోట్లు డిమాండ్ చేశారని తెలుస్తోంది. అయితే అంత పెద్ద మొత్తం వసూలవ్వాలంటే బాహుబలి రేంజు హిట్ కావాల్సి ఉంటుంది. ఈ విషయంలో పంపిణీదారుల్లో మీమాంస కొనసాగుతోందట. ఓవర్సీస్ లో నాన్ బాహుబలి నం.1 హిట్ రంగస్థలం 2.5 మిలియన్ డాలర్లు (18 కోట్లు సుమారు) వసూలు చేసింది. `బాహుబలి` 10 మిలియన్ డాలర్స్ వసూలు చేసింది.. 65-70 కోట్లు వసూలు చేసింది.. `సైరా-నరసింహారెడ్డి` బాహుబలి రేంజు చూపిస్తుందా? అంటూ వాడి వేడి చర్చ... సాగుతోంది. ఇంకా బిజినెస్ డిస్ క్లోజ్ కాలేదని ఫిలింనగర్ లో ముచ్చట సాగుతోంది.