మెగాస్టార్ చిరంజీవి 151వ సినిమా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. కొడుకు నిర్మాతగా తండ్రి నటిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం. అంటే చెర్రీకి కూడా ఈసినిమా చాలా ముఖ్యమన్నమాట. ఈ సినిమా కోసం చాలా కష్టపడుతున్నాడు. ఇదిగో ఇప్పుడు ఆయుర్వేద చికిత్స కూడా తీసుకోబోతున్నాడట.
సైరా సినిమా షూటింగ్ ఎప్పుడో మొదలైంది. మొన్నటి వరకు అంతా యాక్షన్ పార్ట్ మాత్రమే షూటింగ్ చేశారు. మరి ఉయ్యాలవాడ జీవితంలో కూడా రొమాంటిక్ యాంగిల్ ఉంటుంది కదా. ఇప్పుడు ఆ యాంగిల్ చిత్రీకరణ కోసమే చిరంజీవి తెగ కష్టపడుతున్నాడు. యంగ్ ఉయ్యాలవాడగా కనిపించేందుకు చిరంజీవి వైజాగ్ వెళుతున్నాడు. ఎందుకంటే అక్కడ ఆయుర్వేద చికిత్స తీసుకోబోతున్నాడట. చర్మంలో మెరుపును పెంచి, వయసును కాస్త తగ్గించే విధంగా చికిత్స అందిస్తారట. అందుకే వైజాగ్ లోకల్ లీడర్ సలహా మేరకు చిరంజీవి అక్కడి వెళ్లారు. కొన్నిరోజుల పాటూ వైజాగ్ లోనే ఉండి... ఆ చికిత్స పూర్తిచేసుకుని తిరిగి షూటింగ్ లో పాల్గొంటాడట. చిరు కాస్త వయసు తగ్గినట్టు కనిపిస్తే అతనిపై ఉయ్యాలవాడ యువకుడిగా ఉన్నప్పటి సన్నివేశాల చిత్రీకరణ ప్రారంభమవుతుంది. చికిత్స తీసుకుని యంగ్‌చిరు ఎలా ఉంటాడో చూడాలన్న ఉబలాటం అభిమానుల్లో పెరిగిపోవడం ఖాయం.
సైరా విషయంలో చిరంజీవి చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారని తెలుస్తోంది. ఆ మధ్యన ఈ సినిమాకు డైలాగులు సరిగా కుదరలేదని ఆయన ఫీలైనట్టు వార్తలు వచ్చాయి. అందుకే తానే దగ్గరుండి సాయి మాధవ్ బుర్రాను దగ్గర కూర్చోబెట్టుకుని మరీ రాయించాడని సమాచారం. కథ విషయంలో కూడా పరుచూరి బ్రదర్స్ చేత చిన్న చిన్న మార్పులు చేయించారని తెలుస్తోంది. ఆ మధ్యన ఓ వ్యక్తి అసలు ఉయ్యాల వాడ దేశభక్తుడే కాదని, ఓ దోపిడీ దొంగని, అతని సినిమాను ఎలా తీస్తారంటూ ఆరోపించాడు కూడా.