చిరు ఎలా బ్యాలెన్స్ చేస్తాడో..

Update: 2017-01-06 01:30 GMT
మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ మూవీ ‘ఖైదీ నెంబర్ 150’ ఇంకో ఆరు రోజుల్లోనే ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తోంది. ఈ సినిమాపై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. రీమేక్ కావడం వల్ల ఈ సినిమా కథేంటన్నది జనాలకు ముందే ఒక ఐడియా ఉన్నప్పటికీ.. ఆ కథలో చిరు ఎలా కనిపిస్తాడని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇంతకుముందు ‘ఠాగూర్’ సినిమాను తెలుగు నేటివిటీకి తగ్గట్లు మార్చినట్లే ‘కత్తి’కి కూడా తెలుగు టచ్ బాగానే ఇచ్చారని ఈ సినిమా గురించి ఇప్పటిదాకా వచ్చిన అప్ డేట్స్ ను బట్టి తెలుస్తోంది. ముఖ్యంగా ఎంటర్టైన్మెంట్ విషయంలో ఢోకా లేకుండా చూసుకున్నట్లుగా దర్శకుడు వినాయక్ చెబుతున్నాడు.

‘కత్తి’ మూల కథ రైతు సమస్యల నేపథ్యంలో సాగుతుంది. తమిళ వెర్షన్లో హీరోయిజానికి ఢోకా ఏమీ లేకున్నప్పటికీ.. సినిమా చూసి బయటికి వచ్చాక ఈ రైతుల సమస్య నేపథ్యంలో వచ్చే సన్నివేశాలే గుర్తుంటాయి. ఆ సీన్స్ కదిలించేస్తాయి. ఆ ఎపిసోడ్ ను హీరోయిజం.. ఎంటర్టైన్మెంట్ డామినేట్ చేయకుండా చూడటంలో మురుగదాస్ ప్రతిభ కనిపిస్తుంది. ఐతే తెలుగు వెర్షన్ విషయానికి వస్తే.. హీరోయిజం మీద బాగా ఫోకస్ పెట్టినట్లుగా కనిపిస్తోంది. చిరంజీవి కోసం ఈ సినిమాలో ఇమడని పాటలు.. డ్యాన్సులు యాడ్ చేసినట్లున్నారు. అలాగే బ్రహ్మి మీద సెపరేట్ కామెడీ ట్రాక్ కూడా పెట్టారంటున్నారు. ఈ నేపథ్యంలో ఈ మసాలాలు అసలు వంటకాన్ని ఎక్కడ దెబ్బ తీస్తాయో అన్న ఆందోళన లేకపోలేదు. లేటెస్టుగా రిలీజ్ చేసిన నీరు నీరు పాట వింటుంటే సినిమాలో ఇంటెన్సిటీ ఉంటుందనే అనిపిస్తోంది. ఇటు సందేశాన్ని.. అటు ఎంటర్టైన్మెంట్ ను సినిమాలో ఎలా బ్యాలెన్స్ చేశారన్నదాన్ని బట్టే రిజల్ట్ ఆధారపడి ఉండే అవకాశముంది. కమర్షియల్ హక్కుల డోస్ ఎక్కువైపోతే మాత్రం అసలుకే మోసం వచ్చేయడం ఖాయం. మరి వినాయక్ అండ్ కో సినిమాను ఎలా డీల్ చేసిందో చూడాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News