మొన్నటి వరకూ టాలీవుడ్ ఇండస్ట్రీలో పెద్దరికం అంటే టక్కున దాసరి గారే గుర్తొచ్చేవారు. ఆయన మరణం తర్వాత చాలా రోజుల పాటు ఆ లోటు అలాగే ఉండిపోయింది. తమ సినిమాలకు ఎవరైనా పెద్ద దిక్కు వచ్చి ప్రమోషన్ చేస్తే బాగుండని అందరూ ఎదురుచూశారు. ఇక తాము ఎదుర్కునే సమస్యలను కూడా ఎవరితో చెప్పాలా అనే డైలమాలో ఉండేవారు. అయితే ఆ లోటు పూర్తి భర్తీ చేసే పనిలో ఉన్నారు మెగాస్టార్.
అవును చిరు ఇప్పుడు ఇండస్ట్రీలో పెద్దరికం హోదాను తీసుకొని పెద్దదిక్కుగా మారారు. మొన్నటి వరకూ ఆయన సినిమాలపై మాత్రమే ఫోకస్ పెట్టిన మెగాస్టార్ ఇప్పుడు పరిశ్రమలోని సమస్యలపై దృష్టి పెట్టి ముందడుగు వేస్తున్నారు. ప్రస్తుతం చిన్న సినిమాల ఫంక్షన్స్ ని గెస్ట్ ఎటెండ్ అవ్వడమే కాదు వారికి మెగా బ్లెస్సింగ్స్ ఇస్తున్నారు. ఇక ఇండస్ట్రీలో ఏం జరుగుతుందో క్యార్ వ్యాన్ అంటూ ఆర్టిస్టులు ఎంత టైం వేస్ట్ చేస్తున్నారో కూడా తాజాగా ఓ ఈవెంట్ లో చెప్పి జ్ఞానోదయం కలిగించే ప్రయత్నం చేసాడు చిరు. ఈ స్పీచ్ విన్నవరందరికీ ఒక్కసారిగా దాసరి గుర్తొచ్చారు. అవును ఆయన ఎన్నో సందర్భాల్లో ఇలాంటి మంచి విషయాలు చెప్తుండేవారు.
ఇక చిన్న సినిమాలకు థియేటర్స్ దొరకకపోవడం అనే సమస్యను కూడా త్వరలోనే తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ గారితో మాట్లాడి అలాగే ఇండస్ట్రీలో తోటి మిత్రులతో చర్చ జరిపి పరిష్కారం చేస్తానని అన్నారు. ఇలా పూర్తిగా చిరు దాసరి ని భర్తీ చేస్తూ ఇండస్ట్రీకి ప్రస్తుతం ఓ పెద్ద దిక్కులా మారారు. మరి మెగా స్టార్ ఎప్పటికీ ఇదే హోదాలో ఉంటూ కంటిన్యూ చేస్తారా ? చూడాలి.