మెగాస్టార్ యూఎస్ ట్రిప్ ఎందుకో!!

Update: 2017-06-30 07:09 GMT
మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు ఫుల్ జోష్ లోనే ఉన్నారు. ఖైదీ నంబర్ 150 మూవీతో ఫిలిం ఇండస్ట్రీలోకి గ్రాండ్ రీఎంట్రీ ఇచ్చిన చిరు.. తన 151వ సినిమా కోసం సిద్ధమైపోతున్నారు. తొలితరం స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పాత్రలో కనిపించనున్నారు చిరు.

సురేందర్ రెడ్డి దర్శకత్వంలో.. రామ్ చరణ్ నిర్మాణంలో రూపొందనున్న ఉయ్యాలవాడ చిత్రం షూటింగ్ ఆగస్టులో ప్రారంభం కానుండగా.. దీనికి ముందు చిరంజీవి ఫారిన్ ట్రిప్స్ వేస్తుండడం అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది. రీసెంట్ గా మెగాస్టార్ సతీ సమేతంగా చైనా వెళ్లారు. ఎందుకు వెళ్లారో ముందు తెలియలేదు కానీ.. ఆ తర్వాత 80ల నాటి నటులతో ఓ పార్టీ అని చెప్పుకున్నారు. ఇప్పుడు చిరంజీవి హఠాత్తుగా అమెరికా బయల్దేరుతున్నారట. ఈసారి కూడా తన భార్య సురేఖతో సహా వెళ్తున్నారని తెలుస్తోంది.

చిరు అమెరికా ప్రయాణంలో అల్లు అరవింద్ కూడా భార్యా సమేతంగా వెంటే ఉంటారని తెలుస్తోంది. ఇప్పుడు హఠాత్తుగా ఇలాంటి ట్రిప్ ఎందుకనే విషయం ఎవరికీ అర్ధం కావడం లేదు. అయితే.. ఇది సినిమాకి సంబంధించిన.. ఇండస్ట్రీతో సంబంధం ఉన్న పనేమీ కాదని.. పూర్తిగా ఆయన ఫ్యామిలీ టూర్ అని తెలుస్తోంది. దీంతో పాటు మేకోవర్ పై కొన్ని ప్రయోగాలు కూడా చేసే అవకాశం ఉందట.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News